పెద్ద‌న్న‌కు అలా షాకిచ్చిన ఐసిస్‌

Update: 2017-06-26 06:45 GMT
ప్ర‌పంచ పెద్ద‌న్న‌కు ఊహించ‌ని రీతిలో షాకిచ్చింది ఇస్లామిక్ స్టేట్‌. అమెరికాకు చెందిన ప‌లు ప్ర‌భుత్వ వెబ్ సైట్లు హ్యాకింగ్‌ కు గుర‌య్యాయి. హ్యాక్ చేసిన వారు.. వెబ్ సైట్ల‌లో ఇస్లామిక్ స్టేట్ సానుకూల సందేహాల్ని నింపేయ‌టం క‌ల‌క‌లం రేపుతోంది.

అమెరికాలోకి కొన్ని రాష్ట్రాల ప్ర‌భుత్వ వెబ్ సైట్లు భారీగా హ్యాక్ అయిన‌ట్లుగా తెలుస్తోంది. ఒహియో రాష్ట్రంలోని ప‌లు వెబ్ సైట్లు హ్యాక్‌ కు గుర‌య్యాయ‌ని అక్క‌డి వార్తా సంస్థ‌లు చెబుతున్నాయి. ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ఆఫీస్ వెబ్ సైట్ తో పాటు.. రిహాబిలిటేష‌న్‌.. హెల్త్ ట్రాన్స‌ఫ‌ర్ మేష‌న్ తో స‌హా ప‌లు ప్ర‌భుత్వ శాఖ‌ల‌కు సంబంధించిన వెబ్ సైట్ల‌పై హ్యాకింగ్ పంజా ప‌డిన‌ట్లుగా చెబుతున్నారు.

హ్యాక్ చేసిన వెబ్ సైట్ల‌లో ఐసిస్ సందేశాల‌తో నింపేశారు. విష‌యాన్ని తెలుసుకున్న అధికారులు న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టారు. అస‌లు హ్యాకింగ్ ఎలా సాధ్య‌మైంద‌న్న అంశంపై అధికారులు విచార‌ణ నిర్వ‌హిస్తున్నారు.  ప్ర‌భుత్వ వెబ్ సైట్ల‌పై ఐసిస్ హ్యాక్ చేయ‌టం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. ఈ హ్యాకింగ్‌ పై ఐసిస్ ఇప్ప‌టివ‌ర‌కూ ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News