మహాత్ముడికి మరో అరుదైన పురస్కారం దక్కబోతోంది. అగ్రరాజ్యం అమెరికా ఈ కీర్తిని ఇవ్వబోతోంది.. భారత జాతిపితను అత్యున్నత పురస్కారం ‘గోల్డ్ మెడల్’తో సన్మానించేందుకు అమెరికా చట్టసభ ప్రతినిధులు ప్రతిపాదన చేశారు. అమెరికా రాజకీయాల్లో పలుకుబడి కలిగిన వీరంతా చేసిన ఈ ప్రతిపాదనతో భారత్ హర్షం వ్యక్తం చేసింది.
సెప్టెంబర్ 23న హౌస్ ఆఫ్ రిప్రంజేంటేటివ్స్ లో కరోలినా మాలోనే ఈ ప్రతిపాదన చేయగా.. బృందంలో నలుగురు భారత సంతతి సభ్యులున్నారు. అమీబిరా - రాజా కృష్ణమూర్తి - రో ఖన్నా - ప్రమిలా జయపాల్ లు ఈ టీంలు ఉన్నారు. శాంతి - అహింస కోసం కృషి చేసిన మహాత్ముడికి ఈ గోల్డ్ మెడల్ ఇవ్వాలని వారు సభలోని సభ్యులను కోరారు.
అమెరికా చరిత్రలోనే ఇలా ఓ విదేశీ వ్యక్తికి అత్యున్నత పురస్కారం ‘గోల్డ్ మెడల్’ ఇవ్వడం చాలా అరుదు. ఇలా ఇప్పటివరకూ మదర్ థెరిసా (1997) - నెల్సన్ మండేలా (1998) - పోప్ జాన్ పాల్ 2(2000) - దలైలామా (2006) - అంగ్ సాన్ సూకీ (2008) - మహ్మద్ యూనిస్ (2010) - షిమోన్ పీరస్(2014)లు గతంలో అమెరికా పురస్కారాన్ని అందుకున్నారు.
మహాత్మా గాంధీ ని స్ఫూర్తిగా తీసుకునే మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ - నెల్సన్ మండేలా - హో చి మిన్హ్ - ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ - దలైలామాలు ఎదిగారు. అలాంటి గాంధీకి ఇంత లేట్ గా అయినా అమెరికా అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించడం విశేషం.