ట్రంప్‌ కు మరోసారి కరోనా పరీక్షలు..ఎందుకంటే !

Update: 2020-04-03 07:52 GMT
ప్రస్తుతం కరోనా వైరస్‌ తో  ప్రపంచం మొత్తం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ కరోనా వైరస్ రోజురోజుకీ మరింతగా విజృంభిస్తూనే ఉంది.  తగ్గుముఖం మాత్రం పట్టడం లేదు. ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ వచ్చి దాదాపు మూడు నెలలకు పైగానే అయ్యింది. అయినా ఇప్పటికీ ఈ వ్యాధికి సరైన వ్యాక్సిన్ ఇంకా తయారుచేయలేదు.  దీనితో ఈ వైరస్ ఎవరికీ ఎప్పుడు సోకుతుందో తెలీడం లేదు.

దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కూడా కరోనా పరీక్షలు చేయించారు. ఇప్పటికే దీని బారిన పడి పలువురు ప్రముఖులు కూడా మృతి చెందారు. పలువురు దేశ ప్రధానులకు కూడా కరోనా సోకి చికిత్స తీసుకుంటున్నారు. ఇకపోతే , ప్రస్తుతం కరోనా వైరస్  అమెరికాలో చాపకింద నీరులా ప్రబలుతోంది. అమెరికాలో  లక్షల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో ట్రంప్ కూడా కరోనా పరీక్ష చేయించుకున్నారు. మొదటిసారి నెగిటివ్‌గా వచ్చింది. మరలా రెండోసారి ఇన్వాసిస్ పద్దతిలో కరోనా పరీక్షలు చేయించుకున్నారు.

ఈ రిపోర్డుల్లో కూడా కరోనా నెగిటివ్ రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 15 నిమిషాల కంటే తక్కువ సమయంలో ఫలితాలను ఇచ్చే అబాట్‌ లాబరేటరీ ప్రవేశపెట్టిన నూతన పద్దతి ద్వారా ఆయన ఈ పరీక్ష చేయించుకున్నారు. ఈ సందర్బంగా ఆయన స్పందిస్తూ.. నా ఆత్రుతను పక్కన పెట్టి, అది అంత త్వరగా ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలనుందని తెలిపారు. గత నెలలో ట్రంప్‌ తో చర్చలు నిర్వహించిన బ్రెజిల్‌ ప్రతినిధి బృందానికి కరోనా వైరస్‌ పాజిటివ్‌ వచ్చింది. ట్రంప్ ఈసారి ర్యాపిడ్ విధానంలో పరీక్షలు చేయించుకున్నారు. ఈ పద్దతి ద్వారా పరీక్ష నిమిషంలోనే పూర్తి అవుతుంది. పావుగంటలో ఫలితం వస్తుంది.
Tags:    

Similar News