గత కొన్ని నెలలుగా భారత్ , చైనా మధ్య సరిహద్దు వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా గాల్వానా లోయ ఘటన తరువాత భారత్ చైనా విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. అలాగే కొన్ని సోషల్ మీడియా యాప్స్ ను భారత్ లో వాడటం నిషేదించింది. అలాగే ఒకవైపు శాంతి చర్చలు కూడా చేస్తుంది. అయితే కుక్క బుద్ది వంకర అన్నట్టుగా ఎన్ని చర్చలు , సమావేశాలు జరుగుతున్నా కూడా చైనా ముందు సరే అని , వెనుక గోతులు తొవ్వుతుంది. అయితే , మన సైన్యాధికారులు దేనికైనా సిద్ధం అంటూ ఇప్పటికే ప్రకటించారు.
ఇదిలా ఉంటే , ఎల్‌ఏసీ వెంబడి 60,000 మందికి పైగా సైనికులను చైనా మోహరించిందని అమెరికా భారత్ దృష్టికి తీసుకువచ్చింది. అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి మైక్ పాంపీయో మాట్లాడుతూ చైనాపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. చైనా ప్రవర్తన ఏమాత్రం బాగో లేదని, క్వాడ్ దేశాలను కూడా భయపెడుతోందని మండిపడ్డారు. క్వాడ్ దేశాలకు చెందిన విదేశాంగ మంత్రుల సమావేశం టోక్యోలో జరిగింది. ఈ సందర్భంగా అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపీయో విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తో భేటీ అయ్యారు.
చైనాను చూసీచూడనట్లు వదిలేశామని క్వాద్ ప్రజలు భావిస్తున్నారు. మునుపటి ప్రభుత్వాలు కూడా దశాబ్దాల పాటు చైనా చేష్టలను చూస్తూ ఉండిపోయాయి. మన మేథో సంపత్తిని, ఉద్యోగాలను తీసుకెళ్తున్నా, చూసీ చూడనట్లు ఉండిపోయాయి. వారి వారి దేశాల్లో కూడా ఇలాగే జరిగినా మిన్నకుండిపోయాయి అని పాంపీయో మండిపడ్డారు. భారత్ కు వ్యతిరేకంగా చైనా అధిక సంఖ్యలో సైనికులను మోహరిస్తోందని, ఈ సమయంలో అమెరికా స్నేహం భారత్ కు అత్యావశ్యకమని ఆయన తెలిపారు.