అంబులెన్స్ లు లేకుంటే గుర్రాలను వాడండి: హైకోర్టు ఆగ్రహం

Update: 2021-04-28 10:30 GMT
తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. కరోనా కట్టడికి ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలుపాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం చెప్పిన సమాధానాలు సంతృప్తికరంగా లేవని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ‘ప్రభుత్వం చెప్పేదొకటి.. చేసేది మరొకటి అంటూ’ తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

తెలంగాణ ప్రభుత్వం కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు సరిపోవని హైకోర్టు వ్యాఖ్యానించింది. నైట్ కర్ఫ్యూతోపాటు అన్ని సమావేశాలు, వేడుకలను 50శాతం ఆక్యూపెన్సీకి కుదించాలని హైకోర్టు ఆదేశించింది.

ఇక అంబులెన్స్ డ్రైవర్లు దోచుకుంటున్నారని.. వారిని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు.కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను తరలించడానికి అంబులెన్స్ లు అందుబాటులో లేకపోతే గుర్రాలను వాడాలని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.

సరిపడా ఆక్సిజన్ ఆస్పత్రుల్లో సమకూర్చాలని.. ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దని సూచించింది. ఆర్టీపీసీఆర్ టెస్టుల కోసం వేచిచూడకుండా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు పేషెంట్లకు వైద్యం అందించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను అమలు చేయడానికి ప్రభుత్వానికి ఇదే చివరి అవకాశం అని హైకోర్టు స్పష్టం చేసింది.
Tags:    

Similar News