టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోమారు నియామకమయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ కు నూతన కమిటీని ఏఐసీసీ నేడు ప్రకటించింది. ఈ ఎంపికలో పాత కమిటీకే తిరిగి అవకాశం కల్పించారు. కొన్ని స్వల్ప మార్పులతో నూతన కమిటీని ప్రకటించారు. పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ - వర్కింగ్ ప్రెసిడెంట్ గా భట్టి విక్రమార్కతో పాటు 31 మందితో కూడిన తెలంగాణ కాంగ్రెస్ సమన్వయ కమిటీ ఏర్పాటుచేసింది. అదే విధంగా 13 మంది ఉపాధ్యక్షులు - 31 మంది ప్రధాన కార్యదర్శులు - 35 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్లు - 22 మంది శాశ్వత ఆహ్వానితులను నియమించింది.
టీపీసీసీ ఉపాధ్యక్షులుగా నంది ఎల్లయ్య - సబితా ఇంద్రారెడ్డి - డీకే.అరుణ - శ్రీధర్ బాబు - మల్లు రవి - ప్రసాద్ కుమార్ - బలరాంనాయక్ - పొన్నం ప్రభాకర్ - అబీద్ రసూల్ ఖాన్ - మాగం రంగారెడ్డి - నర్సింహారెడ్డి - కుమార్ రావు - నాగయ్య నియమితులయ్యారు. అదే విధంగా సమన్వయ కమిటీలో పార్టీ సీనియర్ నేతలకు అవకాశం కల్పించారు. వరుస వైఫల్యాల నేపథ్యంలో ఉత్తమ్ పదవిపై పలు సందేహాలు వ్యక్తమైనప్పటికీ ఆయన పదవిని నిలబెట్టుకోవడం గమనార్హం.