తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అస్వస్థతకు గురైనట్లుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఆయనకు పెద్ద సుస్తీనే చేసినట్లుగా తెలుస్తోంది. డెంగ్యూ ఫీవర్ సోకిందని.. దీంతో ఆయనకు చికిత్స చేయాల్సి ఉందంటున్నారు. రక్తంలోని ప్లేట్ లెట్స్ భారీగా తగ్గిపోయాయని.. ఆయన కోలుకోవటానికి కొద్ది రోజులు పడుతుందని చెబుతున్నారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్లేట్ లెట్స్ ను పెద్ద ఎత్తున ఎక్కించాల్సిన నేపథ్యంలో ఆయనకు కనీసం ఒకట్రెండు రోజుల పాటు చికిత్స అవసరమని వైద్యులు అభిప్రాయ పడినట్లుగా చెబుతున్నారు. మొత్తంగా ఆయన రెస్ట్ తీసుకొని తన రెగ్యులర్ కార్యకలాపాలు నిర్వహించాలంటే కనీసం ఐదారు రోజులు అవసరమన్న మాట వినిపిస్తోంది. ప్రస్తుతం ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉత్తమ్ కొద్ది రోజులు రెస్ట్ తీసుకోక తప్పని పరిస్థితి.