తెలంగాణ కాంగ్రెస్ కు మరో కష్టం రానుందా...? ఆ పార్టీకి తెలంగాణలో మూడో కృష్ణుడు రానున్నాడా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. అయితే... ఈసారి కృష్ణుడిని అధిష్ఠానం మార్చడం లేదని... ఆయనే సైడైపోవాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణ పరాజయం తరువాత ఇలాంటి ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది.
నిజానికి ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన కారణంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాజాలా ఉండాలి. కానీ... ప్రజలు మాత్రం ఆ పార్టీని కొట్టిన చోట కొట్టకుండా కొడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లోనే చితక్కొట్టిన... ఆ తరువాత ఉప ఎన్నికల్లోనూ పట్టించుకోలేదు. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ను దారుణంగా ఓడించారు. ఆ దెబ్బకు గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ ఇప్పటికే ఆ పదవికి రాజీనామా చేశారు. తాజాగా ఈ పరాజయానికి బాధ్యత వహిస్తూ తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ వర్గాల్లో ఇది చర్చనీయాంశంగా మారింది.
వరంగల్ ఉప ఎన్నిక సమయంలోనే నిరాశకు గురైన ఉత్తమ్ రాజీనామాకు సిద్ధపడితే అధిష్ఠానం వారించిందని ఒక టాక్. తాజాగా గ్రేటర్ ఫలితాల దెబ్బకు ఆయన మరింతగా షాకయ్యారని.. మళ్లీ రాజీనామాకు సిద్ధమయ్యారని అంటున్నారు. అయితే.. మెదక్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయన్ను అధిష్ఠానం ఆగమంటోందని సమాచారం. కాగా ఆయన రాజీనామా చేస్తారని ఓ వైపుఊహాగానాలు వస్తుండగా... కొందరు మాత్రం ఆయన ఇప్పటికే రాజీనామాను అధిష్ఠానానికి పంపించేశారని చెబుతుండడం గమనార్హం.