ప్రజంటేషన్ కు వెన్యూనే దొరకటం లేదంట

Update: 2016-07-13 04:21 GMT
తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం చెప్పేమాటలు మరీ సిత్రంగా ఉన్నాయని చెప్పాలి. తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించటమే లక్ష్యంగా పెట్టుకున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్న మాటలుకామెడీగా ఉంటున్నాయి. తమ చేతకానితనాన్ని కవర్ చేసేందుకు వారు చేస్తున్న ప్రయత్నాలు కామెడీ కామెడీగా ఉంటున్నాయి. అదెలా అంటారా? ఆ మధ్యన తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టుల మీద తెలంగాణ అధికారపక్షం అసెంబ్లీలోనే భారీ ప్రజంటేషన్ కార్యక్రమాన్ని చేపట్టటం.. ముఖ్యమంత్రి కేసీఆర్ గంటల కొద్దీ పీపీటీ సాయంతో ఇరిగేషన్  ప్రాజెక్టుల గురించి వివరించటం తెలిసిందే.

ఈ కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేసిన కాంగ్రెస్ పార్టీ అందుకు తగిన కారణం చెప్పింది లేదు. అదే సమయంలో.. తెలంగాణ అధికారపక్షానికి ధీటుగా తాము సైతం ఒక ప్రజంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రజంటేషన్ ఎప్పుడు ఉంటుందన్న విషయంపై స్పష్టత ఇవ్వలేదు. ఈ మాట చెప్పి నెలలు కావొస్తున్నా ప్రజంటేషన్ ఊసే లేని పరిస్థితి. ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చారు.

తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ప్రజంటేషన్ తప్పుల తడక అని.. తాము ఒక ప్రజంటేషన్ ఇచ్చేందుకు సిద్దం చేశామని.. త్వరలో  ఆ కార్యక్రమాన్ని భారీగా చేపడతామని చెప్పాలి. ఈ మాట ఎప్పటి నుంచో చెబుతున్నదే కదా? అన్న ప్రశ్నను కాస్త మర్యాదగా సంధించిన మీడియా వారికి చిత్రమైన విషయాన్ని చెప్పుకొచ్చారు ఉత్తమ్. అధికారపక్షానికి ధీటుగా ఇవ్వాలని భావిస్తున్న ప్రజంటేషన్ ను భారీగా చేపట్టేందుకు వీలుగా రవీంద్రభారతిలో చేపట్టాలని అనుకున్నామని.. ఇందుకోసం రవీంద్రభారతి హాల్ ఇవ్వాలని కోరితే.. అధికారులు అంగీకరించలేదన్నారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఇచ్చిన పీపీటీ(పవర్ పాయింట్ ప్రజంటేషన్)కు ధీటుగా ప్రజంటేషన్ ఇచ్చేందుకు సరైన వెన్యూ వెతుకుతున్నట్లు వెల్లడించారు. ఇంతకూ ప్రజంటేషన్ రెఢీ అయ్యిందా? అన్నది ఒక ప్రశ్న అయితే.. ఇంత పెద్ద తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అవసరాలకు తగ్గట్లుగా  ఒక్క వెన్యూ కూడా దొరకలేదా? ఎక్కడో ఎందుకు గాంధీ భవన్ సరిపోదా..?
Tags:    

Similar News