తన కంచు కోట.. సొంత ఇలాఖా లో కాంగ్రెస్ ను గెలిపించ లేకపోయిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కాంగ్రెస్ పగ్గాలు వదులు కునేందుకు సిద్ధ మయ్యారట.. ఈ మేరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ని కలిసి పీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు గా చెప్పినట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
పీసీసీ చీఫ్ పదవి కి ఉత్తమ్ రాజీనామా నేపథ్యం లో మొన్న కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ తెలంగాణకు కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక మీద కసరత్తు ప్రారంభించినట్లు తెలిసింది. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్లు అభిప్రాయాలను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
*ఈ ముగ్గురిలో ఒకరికి చాన్స్
ప్రస్తుతం కాంగ్రెస్ లో ఆ ముగ్గురి లో ఒకరికి పీసీపీ పదవి ఖాయమన్న అంచనాలు నెలకొన్నాయి. మొదటగా రేవంత్ రెడ్డి, తర్వాత సీనియర్ కోటాలో జానా రెడ్డి.. వీరిద్దరూ కాక పోతే సౌమ్యుడైన శ్రీధర్ బాబు ల పేర్లు వినిపిస్తున్నాయి.
ఇటీవల హైదరాబాద్ వచ్చిన గులాం నబీ ఆజాద్ సమక్షం లోనే కాంగ్రెస్ నేతలు కొట్లాటకు దిగడం తో పీసీసీ చీఫ్ ఎంపిక వాయిదా పడింది. కోమటి రెడ్డి వెంకట రెడ్డి కి తనకు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని గులాం నబీని కోరినట్టుల సమాచారం. అయితే కోమటి రెడ్డి బ్రదర్స్ ఎన్నికల తర్వాత బీజేపీ వైపు చూడడం వారికి మైనస్ గా మారిందంటున్నారు. టీపీసీసీ చీఫ్ పదవి కి కాంగ్రెస్ అధిష్టానం ప్రస్తుతం రేవంత్ రెడ్డి పేరు నే ప్రధానం గా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
అయితే రేవంత్ రెడ్డి ని కాంగ్రెస్ సీనియర్లు అంతా అభ్యంతరం తెలుపుతున్నారు. టీడీపీ నుంచి వచ్చిన నేతకు ఇవ్వడం ఏంటని.. అనాధిగా పార్టీలో ఉన్న తమకే ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ల ద్వయం అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది.
వీరే కాదు.. బీసీ కోటాలో మధుయాష్కీ, వీ. హన్మంతరావు.. ఎస్సీ కోటాలో సంపత్, ఎమ్మెల్యేగా ఉన్న జగ్గా రెడ్డి సైతం తనకే పీసీసీ పదవి కావాలని డిమాండ్లు మొదలు పెట్టారు. 16వ తేదీ తర్వాత టీపీసీసీ కొత్త చీఫ్ పై కాంగ్రెస్ ఫోకస్ చేయనున్నట్లు సమాచారం.