హ‌నుమంతుడు ఎస్సీ కాదు ముస్లిం

Update: 2018-12-20 16:42 GMT
వాయు సుతుడైన‌ జన్మరహస్యంపై రోజుకో భాష్యం చెప్తున్నారు. తలా ఒక తలాతోకా లేని కహానీ వినిపిస్తున్నారు. రాజస్థాన్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఉత్తర్‌ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హనుమంతుడు దళిత గిరిజనుడని చెప్పారు. రామ భక్తులందరూ బీజేపీకి ఓటు వేయాలని కోరారు. కేవలం రావణుడిని పూజించే వాళ్లు మాత్రమే కాంగ్రెస్‌ కు ఓట్లు వేస్తారని పేర్కొన్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మించాలంటూ ప్రస్తుతం ఆందోళనలు జరుగుతుండటం, కులం పేరుతో ఓట్లు అడగడంతో ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే, తాజాగా యూపీకి చెందిన బీజేపీ ఎమ్మెల్సీ బుక్కల్ నవాబ్ మ‌రో క‌ల‌క‌లం సృష్టించారు.

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హనుమంతుడు దళితుడని ప్రకటించి దుమారం రేపారు. మరికొందరు దళితుడు కాదు గిరిజనుడని చెప్పుకొచ్చారు. సావిత్రీ బాయి ఫూలే అనే దళిత బీజేపీ ఎంపీ హనుమంతుని కోతిని ఎలా చేస్తారని మండిపడుతూ ఏకంగా పార్టీకే రాజీనామా సమర్పించారు. దీనిపై ఆయన మంత్రివర్గ సహచరుడైన రాజ్‌ భర్ హనుమంతుని ఆయన మానాన ఆయనను వదిలేద్దామని ప్రకటించాల్సి వచ్చింది. ఇప్పుడు తాజాగా బుక్కా నవాబ్ హనుమంతుడు ముస్లిం అంటూ సిద్ధాంతీకరించారు. హనుమంతుడు దళితుడు కాదు - గిరిజనుడు కాదు ముస్లిం అని సరికొత్త దుమారం లేపారు. ఈ నిర్ధారణకు ఎలా వచ్చారని అడిగితే.. రహమాన్ - సులేమాన్ వంటి ముస్లిం పేర్లతో హనుమాన్‌ కు ప్రాస కుదురుతుందని పాండిత్యం వెళ్లబెట్టుకున్నారు.
Tags:    

Similar News