ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సరికొత్త రికార్డు సృష్టించారు. అదేమంటే.. దేశంలోనే అతి చిన్న వయసులో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వ్యక్తిగా రికార్డులకు ఎక్కారు. ప్రస్తుతం పుష్కర్ సింగ్ ధామి వయసు 45 సంవత్సరాలు. ఇప్పటి వరకూ ముఖ్యమంత్రి పదవులు చేపట్టిన వారంతా పుష్కర్ సింగ్ కన్నా వయసులో పెద్దవారే కావడం గమనార్హం.
కాగా.. అనూహ్య పరిణామాల మధ్య పుష్కర్ సింగ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న తీరథ్ సింగ్ రాజీనామా చేయడంతో.. ఆయన స్థానంలో పుష్కర్ ను బీజేపీ అధిష్టానం నియమించింది. ఆయన ఇవాళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఉత్తరాఖండ్ లోని పితోర్ గఢ్ కు చెందిన పుష్కర్ సింగ్.. 1975 సెప్టెంబర్ 16వ తేదీన జన్మించారు. వృత్తి రిత్యా ఆయన న్యాయవాది. ఇక, విద్యార్హతల విషయానికి వస్తే.. హ్యూమన్ రిసోర్స్ మేనేజ్ మెంట్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ లో పీజీ చేశారు.
రాజకీయాల పరంగా చూస్తే.. బీజేపీ మాతృసంస్థ ఆరెస్సెస్ లో పనిచేశారు. ఆ తర్వాత 2002 నుంచి 2008 వరకు బీజేవైఎం ఉత్తరాఖండ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. మాజీ ముఖ్యమంత్రి భగత్ సింగ్ కొష్యారీకి ఓఎస్డీగా కూడా పనిచేశారు. ఆ తర్వాత రాజకీయాల్లో క్రియాశీలకంగా మారారు. ఉధమ్ సింగ్ నగర్ లోని ఖాతిమా నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు అనూహ్యంగా ముఖ్యమంత్రి పదవి చేపట్టారు.