జేసీ ఎవడు తన సత్తా రాయలసీమలో చూసుకోవాలంటూ వార్నింగ్!

Update: 2021-03-17 12:55 GMT
నిన్న మాజీ ఎంపీ , టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ కి వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ పాత మిత్రులతో మాట్లాడుతూ , తెలంగాణ కాంగ్రెస్ పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఇక తెలంగాణ లో అధికారంలోకి రాలేదు అని , తెలంగాణ రాష్ట్రం ఇచ్చి సోనియా గాంధీ పెద్ద తప్పు చేసిందని, అక్కడాఇక్కడా లేకుండా పోయిందని జేసీ అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు అలాగే ఉంటే లాభం లేదని ,వేరే దారి చూసుకోవాలంటూ సలహా ఇచ్చారు. అలాగే త్వరలో జరగబోయే నాగార్జున సాగర్ ఉప ఎన్నికపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గంలో తన సహచరుడు, సీనియర్ నేత జానారెడ్డి సాగర్ ‌లో గెలవలేడండూ జేసీ వ్యాఖ్యలపై టీ కాంగ్రెస్ నేతలు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.

జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. సీఎల్పీలో కూర్చుని సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీ దివాకర్ రెడ్డి తన రాజకీయాలు ఆంధ్రాలో చూసుకోవాలని , ఇక్కడ కాదంటూ కౌంటర్ ఇచ్చారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో జానా రెడ్డి ఓడిపోతాడని చెప్పడానికి జేసీ ఎవడు , జ్యోతిష్యాలు చెప్పడం మానుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జేసీకి దమ్ముంటే అనంతపురంలో.. రాయలసీమలో తన బలం చూపించుకోవాలంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జేసీ దివాకర్ రెడ్డి వ్యవహారం చూస్తే కేసీఆర్ కోవర్ట్ అని అర్థమవుతోందని వీహెచ్ అన్నారు. అయన తన రాజకీయాన్ని సీఎం జగన్ పై చూపించుకోవాలని అన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన జేసీ దివాకర్ రెడ్డి సుదీర్ఘ కాలం కాంగ్రెస్‌లో కొనసాగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పనిచేశారు. వైఎస్ క్యాబినెట్‌లో జానారెడ్డితో కలిసి పని చేశారు. రాష్ట్ర విభజనానంతరం ఆయన టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో అనంతపురం ఎంపీగా గెలిచారు. గత ఎన్నికల్లో తన కుమారుడిని బరిలోకి దింపి ఓటమి చవిచూశారు.
Tags:    

Similar News