రాజకీయాల్లో శాశ్విత శత్రువులు.. శాశ్విత మిత్రులు అన్నటోళ్లు అస్సలు ఉండరు. ఐదేళ్ల క్రితం ఇదే మోడీని పూసుకు రాసుకు తిరిగిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ఈ రోజు ఇంతలా తిడతారని కలలోకూడా ఊహించి ఉండరు. అంతేనా.. ఐదేళ్ల క్రితం మోడీని రక్తపిపాసిగా అభివర్ణించిన కేసీఆర్ మాటలు సంచలనంగా మారాయి. నేటికి.. బాబు మాదిరి కాకుండా కేసీఆర్ తన జాగ్రత్తలో తాను తప్పు పడుతున్న వైనం చూస్తున్నదే.
కాంగ్రెస్ కు.. తెలుగుదేశానికి మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందన్న దశ నుంచి.. ఈ రోజు రెండు పార్టీల మధ్య అనుబంధం పెరగటమే కాదు.. కాంగ్రెస్ నేతలు చంద్రబాబును కీర్తిస్తూ స్టేట్ మెంట్లు ఇస్తారని కలలో కూడా ఊహించి ఉండం. ఇలాంటి చిత్రవిచిత్రమైన పరిణామాలు రాజకీయాల్లో మాత్రమే చోటు చేసుకునే ఛాన్స్ ఉండదు.
ఎన్నికల వేళ.. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న వేళ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత వీహెచ్ హనుమంతరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోడీ మీద పోరాటం చేస్తున్నది చంద్రబాబు ఒక్కడేనని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీ ప్రత్యేక హోదా కోసం కేంద్రం పైనా.. మోడీ పైనా.. ఈసీ పైనా చంద్రబాబు ఒంటరి యుద్ధం చేస్తున్నట్లుగా చెప్పారు.
ఇన్ని ఆరోపణలు.. విమర్శలు వస్తున్నా తెలంగాణకు చెందిన ఒక్క అధికారిని కూడా బదిలీ చేయలేదు. కానీ.. ఏపీలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి ఉందన్నారు. ఎన్నికలకు నాలుగు రోజుల ముందు ఏపీ సీఎస్ ను బదిలీ చేయటాన్ని ఆయన తప్పు పట్టారు. కేంద్రం చేతిలో ఆటబొమ్మలా ఈసీ మారిందన్న తీవ్ర విమర్శను చేశారు.
బాబును పొగిడేసి.. మోడీ తీరును కడిగేసినట్లుగా వ్యాఖ్యలు చేసిన వీహెచ్.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో మోడీని తిడుతున్న కేసీఆర్ మరోవైపు ప్రధానితో రహస్య ఒప్పందం చేసుకున్నారన్నారు. మోడీని పొగడటం ద్వారా జగన్.. తాను కేసుల నుంచి బయటపడాలన్న తాపత్రయం కనిపిస్తోందన్నారు.