చిల్.. వీహెచ్ కు రాహుల్ మీదా కోపమొస్తోంది!

Update: 2019-04-14 05:53 GMT
గాంధీల కుటుంబానికి అత్యంత భక్తుడు వీ హనుమంతరావు. ఈ విషయాన్ని ఎవరికీ కొత్తగా చెప్పనక్కర్లేదు. అయితే అలాంటి వీహెచ్ కు ఇప్పుడు ఒక్క సారిగా రాహుల్ మీద కూడా కోపం వచ్చేసిందట. అయితే ఆయన దాన్ని దిగమింగుతున్నారట. అసలు ఆవేశాన్ని మే ఇరవై మూడు తర్వాత చెబుతారట వీహెచ్!

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం హనుమంతరావు మాట్లాడారు. ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ల పంపకం సవ్యంగా జరగలేదని వీహెచ్ వాపోయారు. టికెట్ల పంపిణీలో సామాజిక న్యాయం జరగలేదని ఆయన చెప్పుకొచ్చారు. డబ్బున్న వారికే టికెట్లు వెళ్లాయని, బడుగు- బలహీన వర్గాలకు టికెట్లు దక్కలేదని వీహెచ్ చెప్పుకొచ్చారు.

గతంలో ఇందిరాగాంధీ హయాంలో బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత దక్కేదని, అయితే ఇప్పుడు కాంగ్రెస్ లో ఆ పరిస్థితి లేకుండా పోయిందని వీహెచ్ చెప్పుకొచ్చారు. ఈ విషయంలో రాహుల్ కు జ్ఞానోదయం కలగాలంటూ ఆయన వ్యాఖ్యానించారు.

అయితే రాహుల్ ప్రధాని కావాలనేది మాత్రం తన కోరిక అని వీహెచ్ చెప్పుకొచ్చారు. అంటే రాహుల్ మీద టికెట్ల కేటాయింపులో కోపం ఉన్నా, ఆయన ప్రదాని కావాలని మాత్రం వీహెచ్ కు ఉందట. అయితే తను ఇంకా మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయని.. మే ఇరవై మూడో తేదీ తర్వాత మాట్లాడతానంటూ వీహెచ్ చెప్పుకొచ్చారు. మొత్తానికి ఎన్నికల పరిణామాలు వీహెచ్ కు కూడా కోపం తెప్పించినట్టుగా ఉన్నాయి. చిల్!

Tags:    

Similar News