మీకో మంచి ఆఫర్ ఇది. తెలంగాణ ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయాన్ని మీరు ప్రభావితం చేయవచ్చు. ఆయన బలమైన కాంక్షను మీరు ఓటు ద్వారా పక్కదారి పట్టించవచ్చు. అది కూడా 2019 ఎన్నికలకు కాదు...రేపే. ఏంటి ప్రచారంలో ఉన్న నల్లగొండ పార్లమెంటు ఉప ఎన్నిక గురించా అని అనుకోకండి. కాదు...తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టబోయే కొత్త సచివాలయం గురించి.
ఇంతకీ పాయింట్ ఏంటంటే....ఇటీవలి కాలంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై దూకుడుగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత - మాజీ ఎంపీ వి.హనుమంత రావు కొత్త ప్రతిపాదన ఒకటి తెరమీదకు తెచ్చారు. అదేంటయ్యా అంటే కేసీఆర్ కు వ్యతిరేకంగా పోలింగ్ నిర్వహించడం. ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు తన మార్క్ కోసమే కొత్త సచివాలయ నిర్మాణం చేపడుతున్నారని విమర్శించిన వీహెచ్....కొత్త సచివాలయం అవసరమా? కాదా? అనే అంశంపై ప్రజా బ్యాలెట్ నిర్వహించనున్నట్టు తెలిపారు. హైదరాబాద్ నగరంలో మొత్తం 20 బ్యాలెట్ బాక్స్ లు పెడుతున్నామని, తద్వారా ప్రజలు తమ నిర్ణయాన్ని తెలియజేయాలని కోరారు. 26న ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుందని, 27న సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కౌంటింగ్ నిర్వహిస్తామని వీహెచ్ ప్రకటించారు. పోలింగ్ తో వెలువడే ప్రజాభిప్రాయంతోనైనా సీఎం కేసీఆర్ ఆలోచనలో మార్పు రావాలని కోరుకుంటున్నానని వీహెచ్ చెప్పారు.
``అమాయకత్వం కాకపోతే...తన మాట...ఏది ఏమైనా ఖచ్చితంగా నెగ్గితీరాలనే మొండిపట్టుకు మారుపేరైనా తెలంగాణ ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ బలమైన నిర్ణయాన్ని ఓటింగ్‌తో మార్చేస్తారా? 300 ఎకరాల స్థలం వదులుకోవడం దాదాపు రెండు వందల కోట్ల రూపాయల ప్రత్యక్ష ఖర్చుకు కూడా వెరవకుండా కొత్త సచివాలయం నిర్మించుకునేందుకు సిద్ధపడి...ఇందుకోసం కేంద్రంతో భారీ స్థాయిలో లాబీయింగ్ చేసి... ఎట్టకేలకు రక్షణ శాఖ భూములు సంపాదించి మరీ నూతన సచివాలయం కోసం ముందుకు సాగుతుంటే...వీహెచ్ పోలింగ్ తో సీఎం కేసీఆర్ వెనక్కు తగ్గుతాడా?``` అంటారా....నిజమే!అయితే...వీహెచ్ ప్రచార ప్రయత్నం ఆయనది. కానీయండి. ఏం జరుగుతుందో ఎదురుచూద్దాం.