గల్లీలో పెద్ద ఆదరణ లేకున్నా.. ఢిల్లీలో మాత్రం హవా నడిపించే కొందరు నేతల్లో తెలంగాణ కాంగ్రెస్ నేత వీహెచ్ హనుమంతరావు ఒకరు. తెలంగాణలో ఆయనకున్న పట్టు ఎంతపాటిదో అందరికి తెలిసిందే. అయినప్పటికీ ఏదో ప్రయత్నం చేస్తూ బండి లాగిస్తుంటారు. విభజన సమయంలో తెలంగాణ విషయాలు తెలంగాణనేతలు మాత్రమే మాట్లాడాలని.. ఏపీ విషయాలు ఏపీ నేతలే మాట్లాడాలన్నట్లుగా వ్యవహరించిన కాంగ్రెస్ నేతల్లో వీహెచ్ ఒకరు.
కానీ.. అదే వీహెచ్ ఇప్పుడు అందుకు భిన్నంగా తెలంగాణ విషయాలతో పాటు.. ఏపీ విషయాల్ని ప్రస్తావిస్తూ.. అధినాయకత్వం దగ్గర మార్కులు కొట్టేయటం చూసినప్పుడు వీహెచ్ తెలివితేటలకు మురిసిపోవాల్సిందే.
పార్లమెంటు సమావేశాల ముగింపు సందర్భంగా తమ పార్టీ ఎంపీలకు విందు ఇచ్చే ఆనవాయితీలో భాగంగా బుధవారం రాత్రి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ విందు ఇచ్చారు.దీనికి హాజరైన ఎంపీ వీహెచ్.. కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వీహెచ్ కు బ్రహ్మాండమైన సలహా ఒకటి ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై రాహుల్ గాంధీ ఏపీలో ధర్నా నిర్వహిస్తే బాగుంటుందని.. ఏపీ ప్రజల మనసుల్ని దోచుకోవటంతో పాటు..పార్టీకి మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని పేర్కొన్నారు.
ఈ సలహా రాహుల్ కు బ్రహ్మాండంగా నచ్చేసిందంట. మంచి సలహా ఇచ్చినందుకు వీహెచ్ ను మెచ్చుకున్నట్లుగా వీహెచ్ చెప్పుకున్నారు. మరి.. ఆయన చేసిన సూచన మేరకు రాహుల్..ఏపీ ప్రత్యేక హోదా కోసం ధర్నా చేస్తారా? చేస్తే.. ఎక్కడ..? ఎప్పుడు..? అన్నవి ఇప్పుడు ప్రశ్నలుగా మారాయి.