బాబుకు కాంగ్రెస్ నేత గట్టిగా సపోర్ట్ చేస్తున్నారు!
ఒక విషయం కాదు.. అన్ని విషయాల్లోనూ చంద్రబాబు నాయుడు గట్టిగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల కన్నా ఆయన ఏపీ తెలుగుదేశం వ్యవహారాల గురించినే ఎక్కువగా స్పందిస్తున్నారు. చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రతి పనికీ మద్దతు పలుకుతూ..ఆయన విషయంలో ఈసీ తీరును కూడా వీహెచ్ తప్పు పట్టేస్తూ ఉన్నారు.
కొన్ని రోజుల కిందట వీ హనుమంతరావు మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు పిలిస్తే తను తెలుగుదేశం పార్టీ తరఫున ఏపీలో ప్రచారం చేయడానికి రెడీ అంటూ ప్రకటించారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ సోలోగా పోటీ చేస్తున్నా, వీహెచ్ మాత్రం తను తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ప్రచారానికి రెడీ అని ప్రకటించారు. అంతలా చంద్రబాబు మీద అభిమానాన్ని చాటుకున్నారాయన.
ఇక ఆ తర్వాత ఇంటెలిజెన్స్ డీజీని కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేయడం పై కూడా వీహెచ్ మండిపడిపోయారు. ఆ విషయంలో తెలుగుదేశం పార్టీ కన్నా వీహెచ్ ఎక్కువగా రియాక్ట్ అయ్యారు. సీఈసీ మీద వీహెచ్ దుమ్మెత్తి పోశారు.
ఇక తాజాగా ఏపీ సీఎస్ బదిలీ విషయంలో కూడా వీహెచ్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. పోలింగ్ కు నాలుగు రోజుల ముందు అలా సీఎస్ ను బదిలీ చేయడం ఏమిటని వీ హనుమంతరావు ప్రశ్నించేశారు.
మొత్తానికి కాంగ్రెస్ పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గట్టి మద్దతుదారే దొరికినట్టుగా ఉన్నారు. చంద్రబాబు నాయుడే ఏపీలో గెలవాలని ఈ కాంగ్రెస్ నేత గట్టిగా కోరుకుంటున్నారు. ఆ విషయాన్నే చెబుతున్నారు. బాబు విజయం కోసం వీహెచ్ చాలానే ఆరాటపడుతూ ఉన్నారు!