కరోనా నియంత్రణకు చాలా దేశాలు వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలు పెట్టాయి. అయితే వ్యాక్సినేషన్ పక్రియ మొదలైనప్పటికీ ఈ కా వేసుకోవడానికి పెద్దగా ఎవరూ ముందుకు రాలేదు. దానికి కారణం వ్యాక్సిన్ పై ఉన్న అపోహలే. క్లినికల్ ట్రయల్స్ సక్రమంగా జరిగిందా.. ఒకవేళ వ్యాక్సిన్ వేసుకుంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తుతాఏమో, అసలు టీకా వికటించి ప్రాణాలు కూడా పోతాయేమో ఇలా వ్యాక్సిన్ పై ఒకటి కాదు రెండు కాదు ఎన్నో పుకార్లు ప్రచారంలోకి వచ్చాయి. కొంతమంది రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా కరోనా బారిన పడటం, మరికొంత మంది మరణించడం జరిగింది. దీంతో అసలు వ్యాక్సిన్ పనిచేస్తుందా లేదా అనే సందేహాలు అందరిలో తలెత్తాయి. అందుకే దేశంలో మూడో వ్యాక్సినేషన్ మొదలైనా టీకాపై ఇంకా జనాల్లో భయాలు నెలకొన్నాయి.
ఈ నేపథ్యంలో 97 ఏళ్ల బామ్మ ఎవరూ భయపడొద్దని వ్యాక్సిన్ వేయించుకోవాలంటూ ఆమె చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ వీడియోను సీనియర్ జర్నలిస్ట్ లతా వెంకటేషన్ షేర్ చేశారు. ఆ వీడియోలో బామ్మ మాట్లాడుతూ వ్యాక్సిన్ వేసుకుంటే మనకే కాదు.. మన చుట్టుపక్కల వారికి కూడా ఎంతో సేఫ్ అని, వ్యాక్సిన్ పై వస్తున్న పుకార్లను నమ్మొద్దని వెంటనే వ్యాక్సిన్ వేయించు కోవాలని బామ్మ అవగహన కల్పించింది.
'వ్యాక్సిన్ వేసుకోవడానికి చాలా మంది భయపడుతున్నారు. అందుకు కారణం వ్యాక్సిన్ పై వస్తున్న పుకార్లే. ఎవరూ భయపడొద్దు. వ్యాక్సిన్ వేసుకుంటే ఏమీ కాదు. నేను మార్చిలో వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ వేసుకున్నా. అప్పటి నుంచి నేనెంతో ఆరోగ్యంగా వున్నా. నాలో ఎలాంటి మార్పులు రాలేదు. కొంచెం కూడా నొప్పి అనిపించలేదు. సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు. తాను రెండో డోస్ వేసుకునేందుకు ఎదురుచూస్తున్నా.' అని బామ్మ ఆ వీడియోలో చెప్పారు. 97 ఏళ్ల బామ్మ ముందుకొచ్చి వ్యాక్సిన్ పై భరోసా ఇస్తున్న తీరుపై అంతటా ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది.