తెలంగాణ బాలికలపై వ్యాక్సిన్ ప్రయోగం.. బిల్ గేట్స్ అరెస్టుకు డిమాండ్!
ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సంస్థల్లో ఒకటిగా ఉన్న బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ పై తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంస్థ ద్వారా ఇప్పటి వరకూ ప్రపంచంలోని ఎన్నో దేశాలకు వైద్య సహాయం అందిస్తూ ప్రతిష్ట పెంచుకున్న సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ వార్త బిల్ గేట్స్ సామ్రాజ్యాన్నే కుదిపేస్తోంది. మనదేశంలోని తెలంగాణ, నాగాలాండ్ రాష్ట్రాలకు చెందిన అమాయక గిరిజన బాలికలపై ప్రమాదకర క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారన్న వార్త ఇప్పుడు పెను సంచలనంగా మారింది.
నాగాలాండ్ తోపాటు మన రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన గిరిజన బాలికలపై ఎలాంటి అనుమతులూ లేకుండా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారంటూ ‘గ్రేట్ గేమ్ ఇండియా’ సంచలన కథనం రాసింది. ఇదంతా 2009లో జరిగిందని ఆరోపించింది. అత్యంత వివాదాస్పదమైన గర్డాసిల్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కోసం అమాయక గిరిజన బాలికలను ఉపయోగించుకున్నారని ఆ కథనం తెలిపింది.
శృంగారం ద్వారా సంక్రమించే హ్యుమన్ పాపిలోమా వైరస్ ను నివారించడానికి ఉద్దేశించిన గర్డాసిల్ వ్యాక్సిన్ ను ఈ బాలికలపై ప్రయోగించినట్టు సమాచారం. అమెరికాలోని సియోటెల్ కేంద్రంగా ఉన్న ఎన్జీవో సంస్థ పోగ్రామ్ ఫర్ అప్రాప్రియేట్ టెక్నాలజీ ఇన్ హెల్త్ (పాత్) ద్వారా ఈ వ్యవహారం నడిచినట్టు తెలుస్తోంది. ఇందుకోసం బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ పెద్ద ఎత్తున నిధులు సమకూర్చినట్టు గ్రేట్ గేమ్ ఇండియా వెల్లడించింది.
మొత్తం 14 వలే మంది గిరిజన బాలికలపై ఈ వ్యాక్సిన్ ప్రయోగించినట్టు తెలుస్తోంది. వీరంతా 10 నుంచి 14 సంవత్సరాల లోపు వారేనని కథనం తెలిపింది. అయితే.. నేరుగా వెళ్తే పనికాదని భావించి, ఇంటికి దూరంగా హాస్టళ్లలో చదువుతున్న బాలికలను ఇందుకోసం ఎంచుకున్నట్టు ఆ మీడియా సంస్థ తెలిపింది. అయితే.. ఆ ప్రయోగంలో భాగమైన బాలికలు అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారట. నెలసరి సరిగా కాకపోవడం, తలనొప్పి, ఇతర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, కొందరు మరణించారని కూడా పేర్కొంది.
ఈ తతంగం మొత్తం తల్లిదండ్రులకు తెలియకుండానే నడిపించారని ఆ వార్త తెలిపింది. ఈ కథనం ఈ నెల 25వ తేదీన బయటకు వచ్చింది. దీంతో.. సోషల్ మీడియాలో నేషనల్ లెవల్లో ఈ అంశం ట్రెండింగ్ లో ఉంది. దీంతో.. బిల్ గేట్స్ ను అరెస్టు చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ మేరకు #ArrestBillGates ట్రెండ్ అవుతోంది. మరి, దీనిపై బిల్ గేట్స్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే.. విడాకులతో వార్తల్లో నిలిచిన గేట్స్.. ఇప్పుడు అంతకన్నా పెద్ద విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్నారు.