వివాదాస్పద వ్యాఖ్యలు చేసే తమిళనేతగా పేరున్న వైగో తాజాగా అలాంటి వ్యాఖ్య ఒకటి చేశారు. మరికొద్ది నెల్లలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న వేళ..ఆయన చేసిన వ్యాఖ్య ఇప్పుడు కలకలం రేపుతోంది. తాను నేతృత్వం వహిస్తున్న ప్రజా సంక్షేమ కూటమి కానీ పవర్ లోకి వస్తే ఏపీ సీఎం చంద్రబాబును జైలుకు పంపుతామని ప్రకటించారు. ఉన్నట్లుండి వైగోకి చంద్రబాబు మీద అంత కోపం ఎందుకు వచ్చింది? ఆయన్ను జైలుకు పంపాలన్న ఆలోచన ఎందుకొచ్చిందంటే.. కాస్త వెనక్కి వెళ్లాలి.
ఆ మధ్యన ఎర్రచందనం దుంగల్ని అక్రమంగా కొల్లగొట్టే కిరాయిమూకల్ని భద్రతాధికారులు అడ్డుకునే ప్రయత్నం చేయటం.. ఈ సందర్భంగా వారు అధికారులపై దాడి చేసే ప్రయత్నం చేయటంతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 20 మంది ఎర్రచందనం కూలీలు మరణించటం అప్పట్లో సంచలనంగా మారింది. ఈ ఉదంతంపై తమిళనాడు ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
తాజాగా అదే విషయాన్ని ప్రస్తావిస్తున్న వైగో.. పొట్టకూటికి కోసం పనికి వచ్చిన తమిళులను ఎన్‌కౌంటర్ చేయటం దారుణమైన విషయమని.. తమ వారిని అన్యాయంగా హతమార్చిన దానికి బదులుగా చంద్రబాబును జైలుకు పంపుతానమ ఆయన వ్యాఖ్యానించారు. తమిళనాడులోని తెలుగువారిని తాము బాగా చూసుకుంటున్నామని వ్యాఖ్యానించారు. పొట్టకూటి కోసమని.. దొంగతనం.. రౌడీయిజం చేయకూడదు కదా? అదే పని తమిళనాడులోని తెలుగువారు చేస్తే అక్కడి ప్రభుత్వం.. వ్యవస్థలు చూస్తూ ఊరుకుంటాయా? ఇలాంటివేమీ వైగో లాంటి నాయకుడికి పెద్దగా పట్టనే పట్టవు.