చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించే నాయకులు - పరిపాలన పెద్దలుగా ఉన్న వారు సందర్భానికి అనుగుణంగా వ్యవహరించాలి. వీలైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండాలి. కానీ కొందరికీ ఇలాంటి వాటిపై తెగమక్కువ ఉన్నట్లు కనిపిస్తుంది. కర్నాటక గవర్నర్ వజూభాయి వాలా ఇలాంటి వ్యాఖ్యాల్లో ముందుంటారు. తాజాగా తన వివాదాస్పద వ్యాఖ్యలతో మళ్లీ గవర్నర్ సాబ్ కష్టాల్లో పడ్డారు.
మైసూరు విశ్వవిద్యాలయంలోని క్రాఫోర్డ్ హాల్‌లో కాలేజీ విద్యార్థినులు పెద్ద సంఖ్యలో ఉండగానే తనదైన శైలిలో కాలేజీ అమ్మాయిలను ఉద్దేశిస్తూ ఆయన, మీకు లిప్ స్టిక్ లు - ఫ్యాన్సీ దుస్తులు ఎందుకంటూ వ్యాఖ్యలు చేశారు. కాలేజీలంటే అందాల పోటీల వేదికలు కాదని కూడా ఆయన అన్నారు. 'అబ్బాయిలూ - అమ్మాయిలూ అందరూ తెలివైన వాళ్లే... జీవితంలో ఏదైనా సాధించాలంటే మరోదాన్ని త్యాగం చేయాల్సిందే. అబ్బాయిలు కొన్ని వ్యసనాల నుంచి బైటపడాలి. అమ్మాయిలు ఫ్యాషన్లు మానెయ్యాలి. మీరు (అమ్మాయిలు) కాలేజీకి వచ్చేది చదువుకోవడం కోసం, అందాల పోటీలో పాల్గొనడానికి కాదు. మీరు కనుబొమ్మల్ని కత్తిరించుకోనవసరం లేదు. లిప్ స్టిక్ పెట్టుకోనవసరం లేదు. వెంట్రుకల్ని కత్తిరించుకోవల్సిన అవసరం కూడా లేదు...' ఇలా సాగింది వజూభాయి ప్రసంగం.
గవర్నర్ గారి మాటలకు అక్కడ హాజరైన శాస్త్రవేత్తలంతా మాటలకు తెల్లబోయారు. వజుభాయ్ వాలా మాటలన్నీ వ్యంగ్య ధోరణిలోనే సాగినప్పటికీ మహిళా సంస్థలు వాటిని తప్పు పట్టాయి. ఇందులో మహిళా వ్యతిరేక - పితృస్వామిక ధోరణి ఉందని విమర్శించాయి.