మరో రోజులో వాలెంటైన్స్ డే రోజు రాబోతుంది. ఈ సమయంలో పర్ఫెక్ట్ గిఫ్ట్ కోసం అందరూ అన్వేషిస్తున్నారు. అదే ప్రస్తుతం కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తుండటంతో ఈ సమయంలో అసలు పర్ఫెక్ట్ గిఫ్ట్ అంటే ఇదే అంటూ వ్యాక్సిన్ యాడ్ ను రిలీజ్ చేసింది ఫైజర్. అమెరికన్ టీవీ హోస్ట్ జిమ్మీ కిమ్మెల్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు పెట్టారు. ఈ పారడీ ట్వీట్ కు కామెంట్... వాలెంటైన్స్ డే కోసం ఒక్క షాట్ చాలు అంటూ కామెంట్ చేశారు.
ఇంతకీ షేర్ చేసిన వీడియోలో ఏముందంటే.. ఓ మనిషి తన పార్టనర్ కి ప్రపోజ్ చేస్తూ ఉంటాడు. అది కూడా చిన్న గిఫ్ట్ బాక్స్ తీసుకుని తన ముందుంచుతాడు. అది ఓపెన్ చేసి చూసేసరికి కరోనా ఫైజర్ వ్యాక్సిన్. అప్పుడు వెనుక నుంచి వాయీస్ ఓవర్ వినిపిస్తుంది. తన కోసం ఒకరిలా కాదు.. తన యాంటీబాడీలా ఉండమని. వీడియో పూర్తి అయ్యేసరికి కరోనా వ్యాక్సిన్ టీకాలు వేయించుకోండి. అని వస్తుంది. కాకపోతే ఇది భళే కామిక్ టర్న్ తీసుకుంది. అందులో వినిపించే మరొక మాట ఫైజర్ వ్యాక్సిన్ ప్రతిచోట దొరకదని. ఈ యాడ్ ఇండియన్ బిజినెస్‌మన్ ఆనంద్ మహీంద్రా కూడా నచ్చింది. తానే స్వయంగా స్పందించి షేర్ చేశారు. వ్యాక్సిన్ అనేది ఇక ఎప్పటికీ ఉంటుంది అని ట్వీట్ చేశారు. దాంతో పాటు సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆదార్ పూనావాలాను కూడా ట్యాగ్ చేశారు. ఉల్లాసంగా ఉంది ఈ యాడ్. రెడీమేడ్ యాడ్ మీకు దొరికేసిందని కామెంట్ చేశారు.