గుడివాడ‌లో రాధా.. ఈ యాత్ర‌ల‌ రీజ‌నేంటి?

Update: 2021-09-22 15:30 GMT
వైసీపీ నాయ‌కుడు, మంత్రి, ఫైర్ బ్రాండ్.. కొడాలి నాని ఇలాకా.. అంటే.. ఆయ‌న‌కు తిరుగులేద‌ని అంద‌రూ అంటారు. అంతేకాదు.. వ‌రుస విజ‌యాల‌తో ఆయ‌న మోత మోగిస్తున్నారు. ఇక్క‌డ ఎలాంటి నాయ‌కులు ప్ర‌త్య‌ర్థులుగా వ‌చ్చినా..నానిని ఓడించ‌డం అనేది అసాధ్య‌మ‌నే విష‌యం ఇటీవ‌ల కాలంలో అంద‌రికీ తెలిసిందే. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డి నేత‌ల‌ను కాద‌ని.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు విజ‌య‌వాడ నుంచి యువ నాయ‌కుడు.. దేవినేని అవినాష్‌ను తీసుకువ‌చ్చి.. ఇక్క‌డ టికెట్ ఇచ్చారు. అయితే.. ఏం జ‌రిగిందో అంద‌రికీ తెలిసిందే. అలాంటి నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్పుడు అనూహ్యంగా కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన, విజ‌య‌వాడ‌కు చెందిన నాయ‌కుడు.. వంగ‌వీటి రాధా కృష్ణ కొన్ని రోజులుగా రాజ‌కీయాలు చేస్తున్న‌ట్టు స‌మాచారం.

వాస్త‌వానికి మంత్రి కొడాలి నాని, వంగ‌వీటి రాధాలు అత్యంత ఆప్త‌మిత్రులు. వైసీపీలో ఉన్న‌ప్పుడు.. వీరిద్ద‌రూ త‌ర‌చుగా పార్టీలు చేసుకున్నార‌నే వ్యాఖ్య‌లు కూడా వినిపించాయి. ఇక‌, 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం కోసం రాధా ప‌ట్టుబ‌ట్టిన‌ప్పుడు.. పార్టీ నుంచి వెళ్లిపోవాల‌ని ప్ర‌క‌ట‌న చేసిన‌ప్పుడు కూడా కొడాలినాని రాయ‌బారం న‌డిపారు. వెళ్లొద్దు.. ఉండు! అంటూ.. ఆయ‌నకు సూచించారు. అయిన‌ప్ప‌టికీ..రాధా టీడీపీ బాట‌ప‌ట్టారు. ఇక‌, ఆ త‌ర్వాత నుంచి ఇద్ద‌రి మ‌ధ్య గ్యాప్ పెరిగింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ క్ర‌మంలో తాజాగా.. రాధాగా గుడివాడ‌లో ప‌ర్య‌టిస్తున్నా.. నాని మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు.

గుడివాడలో ప్రస్తుతం వీరిద్దరి గురించే చర్చ నడుస్తోంది.  గుడివాడలో వంగ‌వీటి రాధా ఒంటరి పర్యటనలు చేస్తున్నా.. నాని ప‌ట్టించుకోక‌పోవ‌డం కూడా ఆస‌క్తిగా మారింది. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌ల వెనుక రాదా స్కెచ్ వేరే ఉంద‌ని అంటున్నారు. అంతేకాదు. ఆయ‌న ఇక్క‌డి కాపు సామాజికవర్గ నేతలతో భేటీలు నిర్వహిస్తున్నారు. ఏ చిన్న కార్యకమమైనా హాజరవు తున్నారు. ఇటీవల గుడివాడలో నానిని పట్టించుకోకుండా రాధా.. పర్యటనలు కొనసాగిస్తున్నారు. వీరిద్దరూ ఇటీవల ఎక్కడా కలవకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల మంత్రి నాని తీరుపై గుడివాడ కాపు సామాజికవర్గ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. నాని తీరు వేరుగా ఉంద‌ని.. ఆయ‌నపై కాపు సామాజిక వ‌ర్గం ఆగ్ర‌హంతో ఉన్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక‌, మంత్రిగా నాని ఇత‌రత్రా వ్య‌వ‌హారాల్లో బిజీగా ఉండ‌డం.. ఆయ‌న‌పై వివిధ ఆరోప‌ణ‌లు రావ‌డం.. వంటివి కూడా నియోజ‌క‌వ‌ర్గంలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ నేప‌థ్యంలో అనూహ్యంగా కాపు సామాజిక వ‌ర్గానికిచెందిన రాధా.. ఇక్క‌డ ప‌ర్య‌టించ‌డం.. రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రించుకుంది. ప్ర‌స్తుతం టీడీపీలో ఉన్న రాధా.. చంద్ర‌బాబు అనుమ‌తి లేకుండా.. ఇక్క‌డ‌కు వ‌చ్చారా? అనేది సందేహం. ఆయ‌న అనుమ‌తి ఉంటే.. కార‌ణం ఏంటి?  వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి ఛాన్స్ కోరుతున్నారా? అనే సందేహాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ప్ర‌స్తుతం విజ‌య‌వాడ‌లో టీడీపీ నేత‌లు చాలా మందే ఉన్నారు. స‌ఖ్య‌త ఉందా.. లేదా..అ నే విష‌యాన్ని ప‌క్క‌న పెడితే..తూర్పులో గ‌ద్దె రామ్మోహ‌న్‌, ప‌శ్చిమ‌లో జ‌లీల్‌ఖాన్‌.. సెంట్ర‌ల్‌లో ఫైర్ బ్రాండ్ బొండా ఉమా.. వంటివారు ఉన్నారు. సో.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టికెట్ ఇచ్చే ప‌రిస్థితి రాధాకు లేకుండా పోయింది. ఈ నేప‌థ్యంలో పొరుగున ఉన్న గుడివాడ అయితే.. కాపుల ఓటు బ్యాంకు ఎక్కువ‌గా ఉండ‌డం.. రాధాకు కూడా తెలిసిన నియోజ‌క‌వ‌ర్గం కావ‌డం.. అదేస‌మ‌యంలో త‌మ శ‌త్రువు.. కొడాలి నానిపై ఆయ‌న స్నేహితుడికే టికెట్ ఇచ్చి చుక్క‌లు చూపించ‌డం.. వంటివి చంద్ర‌బాబు ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు దారితీసస్తున్నాయి. ఒక‌వేళ రాధాకు క‌నుక గుడివాడ టికెట్ ఇస్తే.. నానికి ఒకింత ఇబ్బంది పెట్టిన‌ట్టే అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి చూడాఆలి ఏంజ‌రుగుతుందో.
Tags:    

Similar News