వంగ‌వీటి రాజ‌కీయం ఎటు? మ‌ళ్లీ ఛాన్స్ మిస్సేనా?

Update: 2021-09-28 23:30 GMT
విజ‌యవాడ రాజ‌కీయాల్లో ప్ర‌త్యేక గుర్తింపు.. ప్ర‌త్య‌క ఓటు బ్యాంకు ఉన్న కుటుంబం వంగ‌వీటి రంగా ఫ్యా మిలీ. అయితే.. ఆయ‌న వార‌సుడిగా రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేసిన రాధా.. ఎప్ప‌టిక‌ప్పుడు తీసుకుంటు న్న నిర్ణ‌యాలు.. వేస్తున్న అడుగుల‌తో త‌న కెరీర్‌ను త‌నే పాడు చేసుకుంటున్నారా? అనే సందేహాలు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతంటీడీపీలో ఉన్న రాధా.. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు.. చంద్ర‌బాబు చెంత‌కు చేరారు. అయితే.. పార్టీ అధికారంలోకి రాలేదు. అయిన‌ప్ప‌టికీ.. అమ‌రాతి ఉద్య‌మంలో పాల్గొంటున్నారు. వివిధ రూపాల్లో పార్టీ త‌ర‌ఫున జ‌రుగుతున్న కార్య‌క్ర‌మాల్లోనూ పాల్గొంటున్నారు.

అయితే.. ఇప్పుడు హ‌ఠాత్తుగా ఆయ‌న మ‌ళ్లీ యూట‌ర్న్ తీసుకుంటున్నార‌నే వ్యాఖ్య‌లు, విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. ఇటీవ‌ల మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానితో స‌మావేశం కావ‌డం.. దాదాపు రెండు గంట‌ల పాటు .. ఇద్ద‌రూ చ‌ర్చించుకోవ‌డం.. వంటి ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. మ‌ళ్లీ రాధా రాజకీయం మారుతోంద‌నే వాద‌న వినిపిస్తోంది. అయితే. దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు రాధా నుంచి ఎలాంటి స్పంద‌న క‌నిపించ‌లేదు. ఆయ‌న ఈ వార్త‌ల‌ను ఖండించ‌లేదు.. అలాగ‌ని స‌మ‌ర్ధించ‌నూ లేదు. సో.. దీనిని బ‌ట్టి.. ఆయ‌న వ్యూహంఏంట‌నేది ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు.

వంగ‌వీటి రంగా ఫ్యామిలీకి జిల్లాలోనే కాకుండా.. విజ‌య‌వాడ‌లోనూ మంచి పేరుంది. ఇదే.. 2004లో తొలిసారి తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి రాధా పోటీ చేసిన‌ప్పుడు ఘ‌న విజ‌యాన్ని అందించింది. అయితే..అప్పుడ‌ప్పుడే ఎదుగుతున్న రాధా.. త‌న‌ను తాను నిల‌దొక్కుకునే ప్ర‌య‌త్నం చేయ‌డంలో విఫ‌ల‌మ‌య్యార‌నే వాద‌న ఉంది. 2009లో చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీలో చేరారు. ఆ వెంట‌నే.. వ‌చ్చిన ఎన్నిక‌ల్లో ఈ పార్టీ టికెట్‌పై పోటీ చేశారు. అయితే.. ఈ ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓడిపోయారు. ఆత‌ర్వాత పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయ‌డంతో.. రాధా. వైసీపీ వైపు మొగ్గు చూపారు.

2014లో వైసీపీ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయారు. అంటే.. వ‌రుస ప‌రాజ‌యాలు పొందారు. నిజానికి ఒక ప‌రాజ‌యం వ‌చ్చిన‌ప్పుడే.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన నాయ‌కుడు.. రెండు సార్లు ప‌రాజ‌యం పాలైనా.. త‌న‌నుతాను స‌మీక్షించుకోలేక పోయారు. ఈ క్ర‌మంలోనే.. వైసీపీతో వివాదం వ‌చ్చేలా చేసింది. జిల్లాలో ఎక్క‌డైనా పోటీ చేయండి.. అన్న పార్టీ పిలుపును ప‌క్క‌న పెట్టి.. సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం కోసం ప‌ట్టుబ‌ట్టారు. దీంతో పార్టీ ఈటికెట్ ఇవ్వ‌న‌ని చెప్ప‌డంతో టీడీపీలోకి వ‌చ్చారు. అయితే.. ఇక్క‌డ అస‌లు ఖాళీనే లేక‌పోవ‌డంతో.. మౌనంగా ఉండిపోయారు.

ఇక‌, ఇప్పుడు మ‌ళ్లీ.. వైసీపీ వైపు చూస్తున్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే.. ప్ర‌స్తుతం వైసీపీకి. విజ‌య‌వాడ మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ న‌నాయ‌కులు ఉన్నారు. దీంతో రాధాకు ఇక్క‌డ స్థానం ద‌క్కే ప‌రిస్థితి లేదు.  ఈనేప‌థ్యంలో మ‌ళ్లీ వైసీపీలోకి వెళ్లి రాధా సాధించేది ఏంటి? అంటున్నారు ప‌రిశీల‌కులు. పైగా.. ఇప్పుడు పార్టీలోకి వెళ్లినా.. మునుపు ఉన్న గౌర‌వం ఇప్పుడు ఉంటుందా? అనేది ప్ర‌శ్న‌. మొత్తానికి రాధా ప్ర‌యాణం.. అగ‌మ్య గోచ‌రంగా ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.
Tags:    

Similar News