తితిదే ఈవో పదవి విషయంలో పవన్ అభ్యంతరాలపై టీడీపీ నేత వర్ల రామయ్య ఘాటుగా స్పందించారు. పదవిని సమర్థవంతంగా నిర్వహించేవారు కావాలి కానీ, ఉత్తరాది-దక్షిణాది అన్న భేదమెందుకని ప్రశ్నించారు. ఏపీ సీఎం చంద్రబాబు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పడం లేదా...? ఆయన దక్షిణాదివారు కాదా అని ప్రశ్నించారు.
పవన్ కల్యాణ్ గత ఎన్నికల్లో తమకు మద్దతిచ్చాడని, అయినంత మాత్రాన ఎలా పడితే అలా మాట్లాడితే సరిచేయకుండా ఉండలేమని ఆయన తెలిపారు. టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవి దక్షిణ భారతీయులకు మాత్రమే అని ఎక్కడైనా చట్టంలో ఉందా? అని ఆయన ప్రశ్నించారు. సింఘాల్ సమర్థుడైన ఆఫీసర్ అని ఆయన చెప్పారు. ఆయన సరిగా పని చేయకపోతే ఎప్పుడైనా ఆయనను తొలగించవచ్చని.. అది మన చేతుల్లోనే ఉన్న వ్యవహారమని ఆయన తెలిపారు.
గతంలో ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడిగా ఉత్తరభారత రాజకీయాల్లో చక్రం తిప్పారని అన్నారు. ప్రభుత్వంపై ఎవరైనా విమర్శలు చేస్తే...ప్రజలంతా హర్షించేలా ఉండాలని ఆయన సూచించారు. నేను దక్షిణ భారతీయుడనని ఎక్కడా అనవద్దని ఆయన తెలిపారు. ఉత్తరాదిలో కేంద్ర విజిలెన్స్ కమిషనర్ గా ఏపీకి చెందిన వీరయ్య చౌదరి విధులు నిర్వర్తించడం లేదా? అని ఆయన అన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/