కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నిక ఇప్పుడు హాట్ టాపిక్‌లా మారిపోయిందనే చెప్పాలి. అటు అధికార టీడీపీతో పాటు ఇటు విపక్ష వైసీపీ కూడా నంద్యాలలో విజయం సాధించాల్సిందేనన్న పట్టుదలతో ఉన్నాయి. ఈ క్రమంలో పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో అక్కడ ప్రచారం హోరెత్తిపోతోంది. చంద్రబాబు మూడేళ్ల పాలనను ప్రస్తావిస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... ఆ అరాచక పాలనకు చరమగీతం పాడేద్దామంటూ పిలుపునిచ్చారు. అదే మాటను ఆయన పదే పదే చెబుతున్న వైనం కూడా మనకు తెలిసిందే. చంద్రబాబు పాలనను చూపుతున్న జగన్... ఇలాంటి పాలనను సాగిస్తున్న చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చి చంపినా, ఉరి శిక్ష విధించినా కూడా తప్పు లేదన్న వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు అక్కడ మరింత వేడిని పుట్టించాయనే చెప్పాలి.
జగన్ చేస్తున్న ఈ వ్యాఖ్యలపై టీడీపీ పెద్ద రాద్ధాంతమే చేస్తున్న వైనం మనకు తెలిసిందే. ఈ క్రమంలో కాసేపటి క్రితం వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ హైదరాబాదులోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు సర్కారుపై నిప్పులు చెరిగారు. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారాన్నేకేంద్రంగా చేసుకుని మాట్లాడిన ఆమె... చంద్రబాబు అండ్ కోకు కాస్త సూటిగానే ప్రశ్నలు సంధించారు. అసలు ఇప్పటిదాకా మూడేళ్ల పాటు నవ్యాంధ్రను పాలించారని చంద్రబాబు సర్కారుకు గుర్తు చేసిన వాసిరెడ్డి... ఆ పాలనను చూసి ఓటు వేయండి అని అడిగే దమ్ము ఉందా? అని ఆమె ఏకంగా సవాల్ విసిరారు.
అంతేకాకుండా ఎక్కడ తమ పాలనను గుర్తు చేస్తే ప్రజలు ఛీకొడతారోనన్న భయంతోనే టీడీపీ నేతలు, మంత్రులు... కేవలం జగన్‌పై విమర్శలు చేస్తూనే ప్రచారం సాగిస్తున్నారని కూడా ఆమె చెప్పుకొచ్చారు. జగన్‌పై విమర్శలు చేయడం మినహా ప్రచారంలో ప్రజలకు చెప్పుకునేందుకు మరే అంశం కూడా కనిపించడం లేదని కూడా వాసిరెడ్డి కాస్తంత ఘాటైన రీతిలోనే వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో కూర్చున్నా.. నంద్యాలలో కూర్చున్నా.. జగన్‌ను దూషించడమే పనిగా పెట్టుకున్నారని పద్మ విమర్శించారు. టీడీపీ నేతలు సోమిరెడ్డి - దేవినేని ఉమా - ఆదినారాయణ - వర్ల రామయ్య నంద్యాలలో ప్రెస్ మీట్లు పెట్టి బూతులు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పలానా అభివృద్ధి చేశాం మాకు ఓట్లు వేయండి అని కోరే పరిస్థితి టీడీపీకి లేదని ఎద్దేవా చేశారు. సర్వేల పేరుతో చంద్రబాబు పంపిన విద్యార్థులు ఓటర్లను బెదిరిస్తున్నారని ఆరోపించారు.