సైకిల్ ఎక్కితే చెయ్యి విరుగుతుంది...!

Update: 2018-09-05 14:54 GMT
కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకుని లాభపడాలని చంద్రబాబు నాయుడి ఎత్తుగడ. నిజానికి చంద్రబాబు ఏ ఎన్నికలలోనూ పొత్తు లేకుండా గెలువ లేదు. వంటరి పోరు చంద్రబాబుకు కలసిరాలేదు .... రాదు... ఆయన ఎప్పుడు ఎన్నికలకు వెళ్లినా తన స్వలాభం కోసమే పొత్తు పెట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఎన్నికలలో గెలవాలన్న సిద్దాంతాలను ప్రక్కన పెట్టడం అనవాయితిగానే వస్తోంది. ఎటువంటి సిద్దాంతాలను పాటించకుండా ఒకసారి వామపక్షాలతోను - మరోసారి భారతీయ జనతా పార్టీతోను పొత్తులు కుదుర్చుకున్నారు. నిజానికి వామపక్ష భావాలకు భారతీయ జనతా పార్టీ సిద్దాంతాలకు ఆకాశానికి భూమికి మధ్య ఉన్నంత తేడా ఉంది. ఈ రెండు పార్టీల దారులు వేరువేరే కాదు పూర్తి వ్యతిరేకం కూడా. అలాంటి పార్టీలతో ఎలాంటి సిద్దాంతాలు లేని అధికారమే పరామావధిగా భావించే చంద్రబాబు నాయుడు జత కట్టారు.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ను నిట్టనిలువునా చీల్చిన కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం తెలంగాణలో పొత్తుపై ఆలోచన చేస్తున్న - ఆంధ్రప్రదేశ్‌ లో మాత్రం నాయకులు ససేమిరా అంటున్నారు. తాము సైకిలు ఎక్కితే చంద్రబాబుకు అధికారం వస్తుందని కాంగ్రెస్‌ పార్టీ మాత్రం మరింత దిగజారుతుందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు అంచనా.

తెలుగుదేశం పార్టీతో పొత్తును ఆంధ్రప్రదేశ్  సినీయర్ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణలో ఆ పార్టితో పొత్తుకు తామూ వ్యతిరేకించమని ఆంధ్రప్రదేశ్‌  లో మాత్రం అది జరుగరాదని తెగేసి చెబుతున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌ లో పర్యటించిన కాంగ్రెస్ సినీయర్ నాయకుడు వీరప్ప మోయిలీ ఏపీలో కాంగ్రెస్‌ తో పొత్తు ఉండదని కుండబద్దల కొట్టారు. ఆ సమయంలో ఆయన పక్కన కాంగ్రెస్ పార్టీ సినీయర్ నేత కేవీపీ రామచంద్ర రావు కూడా ఉన్నారు.  చంద్రబాబుతో పొత్తుకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ నాయకులలో కేవీపీ ఒకరు. చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న పార్టీలన్నీ ఉనికిలో లేకుండా పోయాయని ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రం చంద్రబాబును ఆడుకుంటోందని కాంగ్రెస్ నేతల అభిప్రాయం. చంద్రబాబుతో స్నేహం అంటే వానర రాజు వాలితో ఎదురుగా నిలబడి పోరాడడమే అని - దీని వల్ల మన బలం కూడా చంద్రబాబు లాగేసుకుంటారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. వీటన్నీంటిని ద్రుష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయుడితో చెలిమి చేయలా వద్దా అన్నది అధిష్టానమే నిర్ణయించాలని వారంటున్నారు. అయితే చంద్రబాబుతో పొత్తు కర్రను కుర్చీ మీదా వేసుకుని దాని మీద కూర్చోవడమే అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
Tags:    

Similar News