ప్రత్యేక హోదా కోసం సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ కిందామీదా పడుతూ.. ఏపీ అధికారపక్షంపై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ కపట రాజకీయాలు ఏ రేంజ్‌లో ఉంటాయన్న విషయాన్ని తాజాగా మరోసారి స్పష్టమైంది. ఓ పక్క అనంతపురంలో టెంట్లు వేసి.. ఏపీ ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ నిరసన చేస్తుంటే.. మరోవైపు.. అదే పార్టీకి చెందిన వీరప్పమొయిలీ మాత్రం రాజ్యసభలో అందుకు భిన్నమైన వ్యాఖ్యలు చేశారు.
ఏపీ.. తెలంగాణ రాష్ట్రాలకు ప్రత్యేక రాయితీలు కల్పించటాన్ని మొయిలీ తీవ్రంగా వ్యతిరేకించారు. కొత్త రాష్ట్రాల అభివృద్ధిని ఇతర రాష్ట్రాలతో కల్పించొద్దంటూ కేంద్రాన్ని కోరారు. ఏపీ.. తెలంగాణ రాష్ట్రాలకు పన్ను రాయితీ ఇస్తే కర్ణాటక రాష్ట్రం లాంటి పొరుగు రాష్ట్రాల సంగతేమిటంటూ ప్రశ్నించారు. కావాలంటే ఏపీ.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలంటూ ఎదవ సలహా ఒకటి పారేశారు.
సొంత రాష్ట్రం కోసం విపరీతంగా తపిస్తున్న మొయిలీ.. కర్ణాటక రాజకీయాలు చూసుకోకుండా ఏపీకి వచ్చిన విభజన లల్లి పెట్టింది ఎందుకు? మరోవైపు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఏపీ ప్రత్యేక హోదా కోసం కోటి సంతకాల సేకరణ.. తాజాగా నిరసనలు చూస్తున్నప్పుడు.. ఎక్కడ ఎలా మాట్లాడాలో కాంగ్రెస్ పార్టీకి మించి మరెవరికీ చేతకాదన్న భావన కలగటం ఖాయం. ఏపీకి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా విషయంలో తమ పార్టీకే చెందిన కర్ణాటక నేత వ్యతిరేకించిన నేపథ్యంలో.. ముందు దానిపై క్లారిటీ ఇచ్చిన తర్వాత నిరసనలు చేస్తే బాగుంటుందేమో.