పబ్లిక్ గా ఫోటోలు తీసుకుంటూ రాళ్లతో హత్య

Update: 2015-09-07 12:03 GMT
పగ.. ప్రతీకారం అంటూ ఒక వ్యక్తిని అందరూ చూస్తుండగా పబ్లిక్ గా రాయితో కొట్టి అతి దారుణంగా హత్య చేసిన సంఘటన చోటు చేసుకుంది. పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగిందని భావిస్తున్నారు. తమిళనాడు లోని వెల్లోర్ జిల్లాలో ఈ ఘోరం జరిగింది.

తాము చేస్తున్న హత్యను ఫోటోలు తీసుకుంటూ చంపేయటం గమనార్హం. ఈ దారుణానికి పాల్పడిన వారు స్థానికంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీ ఓనర్ కొడుకులుగా చెబుతున్నారు. హత్యకు గురైన వ్యక్తి గతంలో తమ అంకుల్ ని హత్య చేసిన నేపథ్యంలో.. అతడ్ని పట్టుకొని నడిబజార్ లో రాళ్లతో బలంగా మోది..అందరూ చూస్తుండగా హత్య చేశారు.

ఈ ఘోరానికి పాల్పడుతున్న సమయంలో వారి వర్గం వారు ఫోటోలు తీయటం.. వాటి ఆధారంగా నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకోవటం జరిగింది. పగతో రగిలిపోతూ.. ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేయటం స్థానికంగా సంచలనం సృష్టించింది.
Tags:    

Similar News