కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మరోసారి మాతృభాష, మాతృదేశం వంటి విషయాలపై రెచ్చిపోయారు. తన దైన స్టైల్‌లో ప్రాస ప్రసంగాలతో ఇరగదీశారు. ప్రతి ఒక్కరిపైనా సటైర్లతో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా తెలుగు భాషపై ఆయన కున్న మమకారానికి మరింత మసాలా అద్ది మాటల్లో కుమ్మేశారు. వెంకయ్య నాయుడికి తూర్పు గోదావరి జిల్లా సామర్ల కోటలో శుక్రవారం బీజేపీ నేతలు పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. దేశ భక్తి - మాతృభాషలపై ప్రసంగం చేశారు.
తెలుగు భాష గొప్పదనాన్ని - భారతీయ సంస్కృతిని గురించి చెప్పారు. మమ్మీ.. డాడీ.. బీడీ అని పిలవకూడదని చెప్పారు. బోధన ఆంగ్లమయినా భావన భారతీయమే ఉండాలని చెప్పారు. మన అలవాట్లలో భారతీయత కనిపించాలని అన్నారు. చాలా మంది మన భాష మర్చిపోతున్నారని, అమ్మ - నాన్న - అక్క - బావ అనే పిలిస్తేనే చక్కగా ఉంటుందని ఇంగ్లీష్ లో పిలవకూడదని సూచించారు. పిలుపులోనే భారతీయత ఉట్టిపడాలని సూచించారు. భారతీయులందరూ అయిన దానికీ కానిదానికీ కూడా ఇంగ్లీష్‌లోనే మాట్లాడుతున్నారని అన్నారు. మన యాస - గోస - భాష కట్టు బాట్లలో ఎంతో గొప్పదనం ఉందని చెప్పారు.
ఇక, దేశ సంస్కృతి గురించి మాట్లాడుతూ.. మన దేశం గొప్ప సంస్కృతి కలిగి ఉందన్నారు. అయితే, మనవాళ్లు దీనిని చులకన చేస్తున్నారని విమర్శించారు. దీపావళి, దసరా వంటి పెద్ద పండుగలు దేశం మొత్తం చేసుకుంటున్నారని, అయితే, ఇటీవల వాటిని చులకన చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. ఇలాంటి పండుగలను మలేషియా వంటి దేశాల్లో పెద్ద ఎత్తున నిర్వహించుకుంటున్నారని వెంకయ్య చెప్పారు. ఈ దేశ సంస్కృతిలో ఉన్న గొప్పదనాన్ని పరాయి దేశాలు గుర్తిస్తున్నాయని అయితే, మనవాళ్లు మాత్రం దీనిని చులకన చేస్తున్నారని వెంకయ్య విరుచుకుపడ్డారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/