వెంక‌య్య మ‌ళ్లీ ఫీల‌య్యాడు

Update: 2016-11-22 22:30 GMT
నోట్ల రద్దు అంశంపై ప్రతిపక్షాలు పార్లమెంట్‌ ను స్తంభింపజేయడంపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విరుచుకుపడ్డారు. ప్రధానిని విమర్శించడం ప్రతిపకాలకు ఫ్యాషన్ అయిపోయిందని దుయ్యబట్టారు. ప్ర‌ధాన‌మంత్రి మోదీకి వస్తోన్న ప్రజాదరణను చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక పోతున్నాయని మండిపడ్డారు. నోట్ల రద్దు అంశంపై తాము చర్చకు వస్తుంటే ప్రతిపక్షాలు ఎందుకు వెనక్కి పోతున్నాయో చెప్పాలని వెంక‌య్య నాయుడు డిమాండ్ చేశారు. సభను సజావుగా జరిపేందుకు ఎందుకు సహకరించడంలేదో చెప్పాలన్నారు.పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు యుపిఎ ప్రభుత్వం పదేళ్లలో చేయలేని పనులను తమ ప్రభుత్వం రెండున్నర ఏళ్లలో సాధించిందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజనను ప్రధాని మోడీ జూన్‌ నెలలో ప్రారంభించారని, దీనిపై అన్ని రాష్ట్రాలలో వర్క్‌ షాపులు నిర్వహించామని ఆయన అన్నారు. ఉత్తర్‌ ప్రదేశ్‌ - ఢిల్లీనుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని వెంక‌య్య త‌ప్పుప‌ట్టారు. ఈ క్ర‌మంలో ఆయా రాష్ట్రాల్లో ఎలా అభివృద్ధి సాగుతుంద‌ని ప్ర‌శ్నించారు.

నోట్ల రద్దు అంశంపై చర్చకు తాము సిద్దంగా ఉన్నామని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఇవాళ ఆయన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ ఈ అంశం వెల్లడించారు. దేశవ్యాప్తంగా తాము తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు సమర్థిస్తున్నారని పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో డిజిటల్ ఎకానమీ పురోగమిస్తుందని జైట్లీ ధీమా వ్య‌క్తం చేశారు. రాబోయే కొద్ది వారాల్లోగా తమ ప్రభుత్వం వ్యవసాయంపై దృష్టి సారించనున్నట్టు తెలిపారు. త్వ‌ర‌లో రబీ సీజన్ కూడా వస్తున్న నేప‌థ్యంలో ఆ స‌మ‌యానికల్లా త‌మ ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం అవుతాయ‌ని వివ‌రించారు.

ఇదిలాఉండ‌గా బీజేపీ మిత్ర‌ప‌క్ష‌మైన శివ‌సేన కేంద్రం తీరును త‌ప్పుప‌ట్టింది. కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో పేద ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని శివసేన అధినేత ఉద్దావ్ థాక్రే అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ నోట్ల రద్దు అంశపై ప్రధాని మోదీ ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాము కోరుతున్నది నోట్ల రద్దు నిర్ణయంపై కాదని - కేంద్రం తీసుకున్న నిర్ణయం అమలుపై అని పేర్కొన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News