విభజన పేరుతో ఆంధ్రప్రదేశ్ పీకను కాంగ్రెస్ ఒక నొక్కు నొక్కితే.. బీజేపీ మరో రేంజ్ లో నొక్కటం తెలిసిందే. అన్నీ చేసేస్తాం.. విభజన హామీలన్నీ తీర్చేస్తామంటూ మోడీ సర్కారు మాటలు చెబుతూ మాయ చేస్తున్న సంగతి తెలిసిందే. విభజన కారణంగా దారుణంగా దెబ్బ తిన్న ఏపీని ఆదుకోవటానికి మోడీ సర్కారు అంత సిద్ధంగా లేదన్న విషయం వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తే ఇట్టే అర్థమవుతుంది.
ఏపీకి చాలానే చేస్తున్నట్లు మోడీ సర్కారు చెబుతున్నా.. వాస్తవంలో అవన్ని ఏమేరకు అన్న విషయం ఆంధ్రోళ్లకు బాగానే అర్థమవుతుంది. మొన్నటికి మొన్న రాజమండ్రికి వచ్చి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన బీజేపీ చీఫ్ అమిత్ షా.. మోడీ సర్కారు తన 22 నెలల పాలనలో ఏపీకి ఎన్ని చేశారో తెలుసా అంటూ చాంతాడంత చిట్టా చదివి చాలానే కామెడీ చేశారు. ఆయన జనాల ముందు కామెడీ షో చేస్తే.. తాజాగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు.. లోక్ సభలో హడావుడి చేశారు. అమిత్ షా అమ్మ మొగుడు మాదిరి ఏపీకి చాలా చేసినట్లుగా చెప్పుకున్న ఆయన.. పెద్ద జాబితానే మరోసారి చదివి వినిపించారు. వెంకయ్య చదివిన చిట్టాను చూస్తే.. ఏపీకి మోడీ సర్కారు చేసిందేమిటో ఇట్టే అర్థమవుతుంది. నిర్ణయాలు.. అనుమతులు.. ప్రకటనలు సైతం ఏపీకి ఎంతో చేసేసినట్లుగా చెప్పుకోవటం గమనార్హం. నిజానికి వారు చేసినవి.. దాని వల్ల జరిగేదేమిటో చూస్తే వెంకయ్య మాటల్లో అసలు విషయం ఇట్టే అర్థమవుతంది.
= పోలవరం ప్రాజెక్టుపై ఆర్డినెన్స్ తెచ్చి పార్లమెంటులో చట్టం చేశాం
(చట్టం చేస్తే పోలవరం పూర్తి అవుతుందా? నిధులు ఇచ్చేదెప్పుడు? ప్రాజెక్టును పూర్తి చేసేదెప్పుడు?)
= ఐఐటీ.. ట్రిపుల్ ఐటీ.. ఐఐఎం.. ఐఐఎస్ ఈ ఆర్.. ఈఎస్ ఎస్ వో.. ఎన్ ఐఓటీ సముద్ర పరిశోధన కేంద్రం.. జాతీయ కామధేను పరిశోధన కేంద్రం.. జాతీయ మత్య్స విద్యా కేంద్రం.. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తదితర సంస్థల ఏర్పాటు
(నిజమే.. పలు సంస్థల్ని ప్రకటించగానే సరిపోదు. వాటిని ఏర్పాటు చేసి.. పని చేయటం మొదలైనప్పుడే వాటి వల్ల రాష్ట్రానికి ప్రయోజనం. మరి.. ఈ విషయంలో ఎంత వెనుకుబాటులో ఉన్నట్లు?
= విశాఖ.. తిరుపతి ఎయిర్ పోర్ట్ లను అభివృద్ధి చేశాం
(ఇదొక్క మాట చాలు వెంకయ్య మాటల్లో మాయ అర్థం కావటానికి. పోతే పోయింది ఓ పాతికవేలు ఖర్చు పెట్టి ఈ రెండు ఎయిర్ పోర్ట్ లకు వెళ్లి.. గడిచిన 22 నెలల్లో ఏంత అభివృద్ధి చేశారన్నది ఇట్టే అర్థమవుతుంది. అంతదాకా ఎందుకు.. ఈ రెండు విమానాశ్రయాల్ని అభివృద్ధి చేస్తే.. శంషాబాద్ ట్రాఫిక్ లో ఈ రెండు ఎయిర్ పోర్ట్ ల ట్రాఫిక్ ఎంత?)
= విజయవాడ విమానాశ్రయ ఆధునీకరణ జరుగుతోంది
(సింఫుల్ గా చెప్పాలంటే.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో విజయవాడ ఎయిర్ పోర్ట్ ఎంత? దాని సత్తా ఏంత?)
= కాకినాడలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్.. విశాఖలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటు
(ఏర్పాటు చేయకముందే స్టార్ట్ అయినట్లుగా ఈ బిల్డప్ ఏమిటి?)
ఇంకా చదవటానికి క్లిక్ చేయండి: ఏపీకి చేసిన సాయంపై వెంకయ్య లిస్ట్ చూద్దామా? 2