రాష్ట్రాల మధ్య చిచ్చు రేగినపుడు పెద్దన్న హోదాలో వాటిని పరిష్కరించాల్సిన కేంద్ర ప్రభుత్వం తేలికగా చేతులు ఎత్తేస్తోంది. పునర్విభజనతో వేరుపడిన ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల విషయంలో అనేక పేచీలు పడుతున్నప్పటికీ పదే పదే ఇదే తీరును ప్రదర్శిస్తున్న ఢిల్లీ పెద్దలు మరో కీలక సమస్యపైనా అదే రీతిలో స్పందించారు. ఈ దఫా తెలుగు మంత్రి వెంకయ్యనాయుడు కేంద్రం తరఫున ఇలా ఎస్కేప్ అయ్యారు. తెలంగాణలో ఉన్న సింగరేణి సంస్థకు చెందిన బొగ్గు సరఫరా విషయంలో ఆ సంస్థకు ఏపీ సర్కారుకు మధ్య ఇటీవల పొరాపొచ్చాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే చిత్తూరు జిల్లా మన్నవరం ప్రాజెక్టు పురోగతిపై కేంద్ర మంత్రులు అనంత్ గీథే - పీయూష్ గోయల్ తో కేంద్ర పట్టణాభివద్ధి శాఖ మంత్రి హోదాలో వెంకయ్యనాయుడు చర్చించారు. ఈ సమీక్ష అనంతరం వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడుతూ ఇటీవల తలెత్తిన సింగరేణి కాలరీస్ అంశాన్ని ఏపీ-తెలంగాణ కలిసి పరిష్కరించుకోవాలని సూచించారు. తెలుగు రాష్ట్రాలు ఈ రకంగా ముందుకు సాగి దేశానికి మంచి సందేశాన్ని పంపించాలని వెంకయ్య నాయుడు ఉచిత సలహా ఇచ్చారు.
మన్నవరం నుంచి ప్రాజెక్టు తరలించే ఉద్దేశం లేదని ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. తమ సమీక్ష సందర్భంగా ప్రాజెక్టు నిర్వహణలతో పలు సమస్యలు ఉన్నాయని ఉన్నతాధికారులు పూర్తి వివరాలను వెల్లడించారని ఆయన తెలిపారు. ప్రాజెక్టులో ఈ మధ్యకాలంలో ఎలాంటి కార్యకలాపాలు జరగలేదని, ఉత్పత్తి రూ.కోటి కూడా జరగలేదని ఆయన వివరించారు. రాష్ట్రంలోని పులిమడకలో 4వేల మెగావాట్ల సూపర్ పవర్ థర్మల్ ప్రాజెక్టుపై చర్చించినట్లు తెలిపారు. బొగ్గు సరఫరాకు అవసరమైన అనుసంధానం పూర్తి చేస్తామన్నారు. రైలు మార్గం ద్వారా బొగ్గు సరఫరాపై రైల్వే మంత్రితో మాట్లాడినట్లు వెంకయ్యనాయుడు చెప్పారు. అనంతపురం జిల్లాలో సౌర విద్యుత్ ప్రాజెక్టు అంశంపై చర్చించామని త్వరలోనే 750 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తికి టెండర్లు పిలవనున్నట్లు చెప్పారు. జాతీయ పునరుత్పాదక విశ్వవిద్యాలయం ఏర్పాటుపై అధ్యయనం పూర్తయిందన్నారు. నౌపారా బొగ్గు గనుల స్థానంలో వేరొకటి కేటాయించాలని కేంద్రాన్ని ఏపీ సర్కారు కోరినట్లు వెంకయ్య తెలిపారు. బొగ్గు గని కేటాయింపుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే రాష్ట్రాలకు న్యాయంగా దక్కాల్సిన వాటిని తమ ఖాతాలో వేసుకుంటున్న కేంద్రం చిన్న చిన్న పేచీలపై సైతం చేతులు ఎత్తేయడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/