వెంకయ్య తెలంగాణను వదిలించుకున్నట్లే!

Update: 2016-10-08 13:53 GMT
వెంకయ్యనాయుడు తరచూ కొన్ని మాటలు చెబుతూ ఉంటారు. తాను తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపీగా నెగ్గడం లేదని, కానీ తెలుగు రాష్ట్రాల కోసం మాత్రం విపరీతంగా పాటు పడుతున్నానని పదేపదే చెబుతూ ఉంటారు. కేంద్రమంత్రిగా ఉంటూ... అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు రెండింటికి నిధులు - పథకాలు సాధించడానికి తాను ఎంత గొప్పగా కష్టపడిపోతున్నానో ఆయన చెప్పుకుంటూ ఉంటారు.

కాగా తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన క్రమక్రమంగా తెలంగాణను వదిలించుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ఏపీకి కేంద్రం ప్యాకేజీ ప్రకటించిన తర్వాత.. రాష్ట్రం మొత్తం వెంకయ్యను తిట్టిపోస్తోంటే.. ఆ ప్యాకేజీని సాధించడానికి తానెంత చెమట చిందించానో చెప్పుకోడానికి ఆయన చాలా కష్టపడ్డారు. రాష్ట్రంలో కొన్ని సన్మానాలు కూడా చేయించుకున్నారు. ఏపీ మీద తానెంత శ్రద్ధ చూపిస్తున్నారో పదేపదే చెప్పుకున్నారు.

క్రమంగా ఈ పరిస్తితులు, వాతావరణం.. తెలంగాణకు ఆయనను దూరం చేశాయనుకోవచ్చు. తాజాగా ఉదాహరణ ఏంటంటే.. తెలంగాణలో రాష్ట్ర భాజపా కార్యవర్గ సమావేశాలు జరిగాయి. రెండు తెలుగు రాష్ట్రాల మీద ఫోకస్‌ ఉన్న నాయకుడుగా ఆయన ఆ భాజపా సమావేశాల్లో పాల్గొని.. తాను తెలంగాణ కోసం ఎంత పాటుపడుతున్నానో చెప్పుకుని, దానిని తమ పార్టీ శ్రేణుల ద్వారా కిందిస్థాయి ప్రజల వరకు తీసుకెళ్లాలని కోరి ఉండాల్సింది. కానీ అలాంటి ప్రయత్నమేమీ జరగనేలేదు. వెంకయ్యనాయుడు తెలంగాణ భాజపా కార్యవర్గ సమావేశానికి రానేలేదు. కేంద్రం తరఫున హన్స్‌ రాజ్‌ వంటి మంత్రులు - ఎటూ లోకల్‌ గనుక దత్తాత్రేయ మాత్రమే వచ్చారు. వెంకయ్యనాయుడు తెలంగాణ ను నెమ్మదిగా వదిలించుకుని, తన భవిష్యత్‌ తరాల దృష్ట్యా ఏపీ మీద మాత్రమే ఫోకస్‌ నిలుపుతున్నారా? అని పార్టీ వర్గాలే అనుకుంటున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News