అమిత్‌ షా ఎన్నిక...వెంక‌య్య‌కు పండుగ‌

Update: 2016-01-24 10:58 GMT
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా అమిత్‌ షా మరోసారి ఎన్నిక అయ్యారు. అమిత్‌ షా జాతీయ అధ్యక్షుడిగా ప‌గ్గాలు చేప‌ట్ట‌డం ఇది రెండవసారి. గ‌తంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో షాను ప‌ద‌వికి నామినేట్ చేశారు. అయితే ఈ ద‌ఫా పూర్తి స్థాయిలో ఆయన మూడేళ్లపాటు పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న అమిత్‌ షా పదవీకాలం నిన్నటితో ముగిసిన నేప‌థ్యంలో నూతన అధ్యక్షుడిని ఎన్నికోవలసి వ‌చ్చింది. అమిత్‌ షా పేరును ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ర్టాల ముఖ్యమంత్రులు ప్రతిపాదించారు. అమిత్‌ షాకు పోటీగా మరెవరూ ఎన్నికల్లో పాల్గొనక పోవ‌డంతో షా ఎన్నిక కేవలం లాంఛనప్రాయంగా మారింది. ఎన్నిక అనంతరం అమిత్‌ షాకు సీఎంలు, కేంద్ర మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు.

అమిత్‌ షా అధ్యక్షుడిగా ఎన్నికైన సంద‌ర్భంగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆయ‌న్ను పొగ‌డ్త‌ల్లో ముంచెత్తారు. అమిత్‌ షా అత్యంత సమర్థుడని  కీర్తించారు. సంస్థాగత కార్యకలాపాల నిర్వహణలో అమిత్‌ షాకు ఎంతో సామర్థ్యముందని, అద్భుతమైన వ్యూహాలు రచించగలడని వెంకయ్యనాయుడు చెప్పారు. వీటన్నింటినీ మించి తమ పార్టీ భావజాలానికి నిబద్ధుడై పని చేస్తారని ఆయన అన్నారు. వెంక‌య్య‌నాయుడు అంద‌రికంటే ప్ర‌ముఖంగా, పొగ‌డ్త‌ల‌తో ముంచెత్త‌డం హాజ‌రైన వారిలో చ‌ర్చ‌నీయాశంగా మారింది.
Tags:    

Similar News