ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మరోమారు పొగడ్తల వర్షంలో ముంచెత్తారు. అమరావతిలోని సచివాలయాన్ని మొట్టమొదటి పరిశీలించిన అనంతరం మీడియాతో వెంకయ్య మాట్లాడుతూ.. అతి తక్కువ కాలంలో ఉత్తమ సచివాలయ నిర్మాణం సీఎం చంద్రబాబు పాలనాదక్షతకు నిదర్శనమని అన్నారు. తక్కువ కాలంలో సచివాలయం నిర్మించారని, ఇక్కడ పనిచేసే ఉద్యోగులు చిన్నపాటి సమస్యలు ఉన్నా సర్దుకుపోతుండటం ప్రశంసనీయమన్నారు. సులభతర వాణిజ్య అనుకూల రాష్ట్రాల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు. ఏపీకి మొదటి ర్యాంకు రావడాన్ని అభినందిస్తున్నానని వెంకయ్య నాయుడు అన్నారు. ఉత్తమ పాలన ఉంటే ఎలాంటి ఫలితాలొస్తాయో ఇదే నిదర్శనమని చంద్రబాబును వెంకయ్య ప్రశంసల్లో ముంచెత్తారు.
అనంతరం విట్ విశ్వవిద్యాలయ శంకుస్థాపన కార్యక్రమానికి సీఎం చంద్రబాబు - కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. రూ.2 వేల కోట్లతో ఐనవోలులో విట్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. విట్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం 200 ఎకరాల భూమి కేటాయించింది. తొలిదశలో వంద ఎకరాల్లో విట్ వర్శిటీ భవనాలు నిర్మించనున్నారు.
ఐనవోలులో విట్ వర్శిటీకి శంకుస్థాపన చేసిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రైవేటు రంగంలో మొట్టమొదటి సంస్థగా విట్ కు శంకుస్థాపన చేసుకున్నామని అన్నారు. వెల్లూరు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీది స్ఫూర్తిదాయక చరిత్ర అని అన్నారు. 1984లో స్థాపించిన ఈ సంస్థ 3 దశాబ్దాల్లోనే ప్రపంచస్థాయి విద్యాకేంద్రంగా రూపొందిందని తెలిపారు. విట్ రూపంలో ప్రపంచస్థాయి విద్యాసంస్థ రావడం శుభసూచికమని కొనియాడారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని స్వల్పకాలంలో అద్భుత నైపణ్యాలు సాధించాలని చంద్రబాబు అన్నారు. విద్యార్థులు నైపుణ్యాలు నేర్చుకోవాలనేదే తన కోరిక అని తెలియజేస్తూ విజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకొని మంచి ఫలితాలు రాబట్టాలని చంద్రబాబు అన్నారు. మంచి ఫలితాలతోనే సమాజంలో సంపద సృష్టి జరుగుతుందని పేర్కొన్నారు. సమాజంలో మానవ వనరులు అతి కీలకమైనవి, కాబట్టి వాటిని సక్రమంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత అందరిదని బాబు తెలియజేశారు. దేశ - విదేశాల్లో ఐటీ - సాఫ్ట్ వేర్ రంగాల్లో మన ఇంజినీర్లు దూసుకెళ్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు.
అన్ని క్యాంపస్ ల కంటే అమరావతి విట్ ముందుండాలని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రపంచం మొత్తంలో ఐటీలో తెలుగు ప్రజలే ఉన్నారని కొనియాడారు. దేశంలోని ఉత్తమ వర్శిటీలన్నీ అమరావతికి వస్తాయని పేర్కొన్నారు. ఉన్నత విద్యలో దేశంలో మన రాష్ట్రం ఐదో స్థానంలో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఉన్నత విద్యలో దేశంలోనే నెంబవర్ వన్‌గా ఎదగాలన్నదే నా కొరిక అని కొనియాడారు. ప్రపంచానికి లక్షల సంఖ్యలో ఐటీ నిపుణులు కావాలన్నారు. ఐటీ నిపుణులను ప్రపంచానికి అందించే సత్తా మన విద్యార్థులకు ఉందని పేర్కొన్నారు. విద్యార్థులు కేవలం చదువులకే పరిమితం కాకూడదన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ విట్ వంటి సంస్థలు ఆంధ్రప్రదేశ్ కు రావడం వెనుక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కృషి ఉందని అన్నారు. విట్ ద్వారా వేలాది మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం కీలక సంస్కరణలతో ముందుకు వెళుతోందని వెంకయ్య వివరించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/