త‌మిళ‌నాడు స‌చివాల‌యంలో వెంక‌య్య‌..!

Update: 2017-05-16 12:16 GMT
కేంద్ర ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంక‌య్య‌నాయుడు త‌మిళ‌నాడు ప‌ర్య‌ట‌న ఆస‌క్తిక‌రంగా మారింది. చెన్నైలో మెట్రో సొరంగ మార్గ రైలు ప్రారంభోత్సవానికి వ‌చ్చిన వెంక‌య్య నాయుడు ఆ ప‌ర్య‌ట‌న ముగించుకున్న అనంత‌రం త‌మిళ‌నాడు స‌చివాల‌యంలో స‌మీక్ష‌లు నిర్వ‌హించారు. ఈ పరిణామం రాజ‌కీయాల్లో చ‌ర్చనీయాంశంగా మారింది. మ‌రోవైపు అదే స‌మ‌యంలో బీజేపీ-అన్నాడీఎంకే మ‌ధ్య దోస్తీ కుదిరింద‌ని అంటున్నారు.

రెండు రోజుల ప‌ర్య‌ట‌న కోసం చెన్నై వ‌చ్చిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆదివారం ఉదయం మెట్రో రైలు ప్రారంభోత్సవం పూర్తి చేసుకుని పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంత‌రం త‌మిళ‌నాడు స‌చివాల‌యంలో కేంద్ర పట్టణాభివృద్ధి-దారిద్ర్య నిర్మూలన-గృహవసతి-సమాచార-ప్రసార శాఖలు రాష్ట్రంలో అమలు జ‌రుగుతున్న తీరుపై అధికారులతో వెంకయ్య  సమీక్ష సమావేశం నిర్వహించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఓ కేంద్రమంత్రి రాష్ట్ర సచివాలయంలో సమావేశమైన ఘటన రాష్ట్ర చరిత్రలోనే లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో రాష్ట్ర ప్రభుత్వం నడుచుకుంటోందని వెంకయ్యనాయుడు సంకేతాలు ఇచ్చారని అంటున్నారు. మ‌రోవైపు రాష్ట్ర పాలనలో కేంద్రమంత్రులు జోక్యం చేసుకుంటున్నారంటూ పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, ఇందులో తప్పేముందంటూ పలువురు అధికార అన్నాడీంఎకే పార్టీ నేత‌లు వెంకయ్యకు మద్దతు పలకడం గమనార్హం. సచివాలయంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సమీక్ష సమావేశం నిర్వహిస్తే తప్పేంటని ఉపసభాపతి తంబిదురై విలేక‌రుల‌ను ఎదురు ప్ర‌శ్నించారు. తాను కూడా ఇతర రాష్ట్రాల్లో సమావేశాలు జరిపానని, వెంకయ్య సమావేశాన్ని స్వాగతిస్తున్నామని తంబిదురై వ్యాఖ్యానించారు.

కాగా, చెన్నై ప‌ర్య‌ట‌న‌కు వెంకయ్య వ‌చ్చిన సంద‌ర్భంగా అధికార అన్నాడీఎంకే పార్టీతో పాటుగా బీజేపీ జెండాలు ద‌ర్శ‌న‌మిచ్చాయి. బీజేపీ జెండాలు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుతోపాటు ప్రధాని నరేంద్ర మోడీ ఫొటోలు దర్శనమిచ్చాయి. అన్నానగర్‌లో అన్నాడీఎంకే, బీజేపీ జెండాలు భారీ స్థాయిలో ద‌ర్శ‌న‌మివ్వ‌డంతో ఈ రెండు పార్టీలు మిత్రపక్షాలైపోయాయా? అని ప‌లువురు చ‌ర్చించుకున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/

Tags:    

Similar News