తిరుమల... అఖిలాండ కోటి బ్రాహ్మండ నాయకుడు కొలువై ఉన్న పుణ్యక్షేత్రం.. అందుకే అపర కుబేరుడైన అంబానీ నుంచి నిరుపేద వరకు తిరుమలేషుడిని దర్శించుకోవడానికి నిత్యం వస్తుంటారు. రోజుకు లక్షల మంది జనం దర్శనం చేసుకుంటారు. కానీ సాధారణ జనంతో పోలిస్తే వీవీఐపీల తాకిడే ఎక్కువ. వారి కోసం గంటల తరబడి సాధారణ భక్తులను క్యూలైన్లో ఉంచాల్సిన పరిస్థితి. అయితే వీఐపీలు సంవత్సరానికి మూడు నాలుగు సార్లు వస్తూ ఇలా భక్తులకు దర్శన భాగ్యం కలుగకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
ఇప్పుడు ఈ వాస్తవాన్ని గ్రహించిన భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సాధారణ భక్తుల వలే.. అందరితోపాటే క్యూలైన్లో వైకుంఠ ద్వారం నుంచి వచ్చి అందరికీ స్ఫూర్తినిచ్చాడు. వెంకయ్య రాగానే ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికి స్వామి వారి దర్శనం చేయించారు.
దర్శనం అనంతరం మాట్లాడిన వెంకయ్య.. శ్రీవారి దర్శనం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందని.. వర్షాలు బాగా పడాలని.. ప్రకృతి వైపరీత్యాలు లేకుండా చూడాలని దేవుడిని ప్రార్థించానని పేర్కొన్నారు. ఇక సంవత్సరానికి ఒకసారి మాత్రమే ప్రముఖులు శ్రీవారి దర్శనానికి రావాలని.. తద్వారా సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగకుండా ఉంటుందని పేర్కొన్నారు.
ఇక బీజేపీ ఉప రాష్ట్రపతిని చేయడంతో రాజకీయాలకు దూరమైన వెంకయ్య ఈ సందర్భంగా వైరాగ్య మాటలు మాట్లాడారు.. తాను రాజకీయాల్లో లేనని.. భవిష్యత్ లోనూ వచ్చే ఆలోచన ఏదీ లేదని స్పష్టం చేశారు. దేశానికి సేవ చేసుకునే శక్తిని ఇవ్వమని శ్రీవారిని కోరినట్టు చెప్పారు.