ప‌వ‌న్ ఎక్క‌డంటే అక్క‌డేనా మాధ‌వా!

Update: 2018-02-06 07:40 GMT
క‌మెడియ‌న్ వేణుమాధ‌వ్ ను టీడీపీ గెంటేసిందా..?  అందుకే తాను జ‌న‌సేన పార్టీ త‌రుపున పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారా..? జ‌న‌సేన పార్టీ ఆఫీస్ కు వ‌చ్చిన వేణుమాధ‌వ్  వ‌చ్చేఎన్నిక‌ల్లో జ‌న‌సేనాని ఎక్కడ నుంచి పోటీ చేయ‌మంటే అక్క‌డ నుంచి పోటీ చేస్తాన‌ని చెప్పారు. ప్ర‌క‌ట‌న వ‌రకు బాగున్నా తెలుగుదేశం పార్టీకి వీర‌విధేయుడైన వేణుమాధ‌వ్ ష‌డ‌న్ గా జ‌న‌సేన జెండా ఎందుకు మోస్తున్నార‌నే అనుమానాలు మొద‌ల‌య్యాయి నెటిజ‌న్ల‌కు.

అయితే దీనంత‌టికి కార‌ణం టీడీపీ నేత‌లేన‌ని పొలిటిక‌ల్ కారిడార్లో  కొన్ని వీడియోలు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతున్నాయి.  వేణుమాధ‌వ్ ను టీడీపీ గెంటేసింద‌ని దీంతో  ప‌వ‌న్ కు మ‌ద్ద‌తు ప‌లుకుతున్నార‌నే వాద‌న వినిపిస్తోంది.గ‌తేడాది తెలంగాణ‌లో  టీటీడీపీ జాతీయ స్థాయి విస్తృత స్థాయి స‌మావేశాలు జ‌రిగిన‌ప్పుడు కార్య‌క‌ర్త‌లాగే వేణుమాధ‌వ్ హాజ‌ర‌య్యారు. అయితే ఆ స‌మావేశంలో నేత‌ల‌ ప్ర‌సంగించే స‌మ‌యంలో వేణుమాధ‌వ్ సీఎం చంద్ర‌బాబుతో ప‌ర్స‌న‌ల్ గా మాట్లాడారు. అనంత‌రం అక్క‌డే ఉన్న వేణుమాధ‌వ్ ను చంద్ర‌బాబు  సెక్యూరిటీ వేణుమాధ‌వ్ ను ఉద్దేశిస్తూ సెక్యూరిటీ ప్లాబ్లంగా ఉంద‌ని, ప‌క్క‌నే ఉండ‌మ‌ని చెప్ప‌డం..దానికి వేణుమాధ‌వ్  ఓ ప‌క్కకు వెళ‌తానని చెప్ప‌డం. ఇదంతా వీడియోలో క‌నిపిస్తున్నప్ప‌టికీ రీసెంట్ గా సంబంధిత వీడియో ను సాక్ష్యంగా చూపిస్తూ..చంద్ర‌బాబు సెక్యూరిటీ వేణుమాధ‌వ్ ను తోసేసి అవ‌మానించింద‌నే వార్త‌లు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేశాయి. వాటిపై క‌మెడియ‌న్ స్పందించ‌క‌పోయిన ఆ ఘ‌ట‌న‌పై ఆవేధ‌న వ్య‌క్తంచేసిన వేణుమాధ‌వ్ టీడీపీ కి గుడ్ బై చెప్పి జ‌న‌సేన తీర్ధం పుచ్చుకునేందుకు సిద్ద‌మ‌య్యారంటూ పుకార్లు మొద‌ల‌య్యాయి.

ప్ర‌తీ సంవ‌త్స‌రం ఎప్ప‌టిలాగే కొత్త ధాన్యాన్ని ప‌వ‌న్ కు  ఇచ్చి - ప‌వ‌న్ తోట‌లో పండే మామిడి కాయ‌ల్నితీసుకెళ్లి సాంప్ర‌దాయాన్ని పాటిస్తున్న వేణుమాధ‌వ్ ప‌వ‌న్ తో భేటీ అయ్యేందుకు పార్టీ కార్యాల‌యానికి వ‌చ్చారు. కానీ అక్క‌డ ప‌వ‌న్ క‌ల్యాణ్ లోక‌పోవ‌డంతో వెనుదిరిగిన వేణుమాధ‌వ్ మీడిమాతో ముచ్చ‌టించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ అభీష్టం మేర‌కు ఎక్క‌డ నుంచి పోటీ చేయ‌మంటే అక్క‌డి నుంచి పోటీ చేస్తాన‌ని చెప్పుకొచ్చారు. ఇక టీడీపీ - జ‌న‌సేన పొత్తపై 2019ఎన్నిక‌ల్లో ఆరెండు పార్టీలు క‌లిసి పోటీ చేస్తాయ‌ని,  ఇది త‌న వ్య‌క్తిగ‌త అభిప్రాయమన్నారు. తెలుగు రాష్ట్రాల స‌మ‌స్య‌లే ప‌రిష్కార మార్గంగా ప‌వ‌న్ క‌ద‌లి రావ‌డం శుభ‌ప‌రిణామ‌ని వేణుమాధ‌వ్ ఆనందం వ్య‌క్తం చేశారు.

Tags:    

Similar News