లెఫ్టినెంట్ గవర్నర్ ను ఎమ్మెల్యేలు కలవడం - మాట్లాడడం - తమ సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లడం - ఇక ప్రతిపక్ష ఎమ్మెల్యేలైతే ప్రభుత్వ వైఫల్యాలను లెఫ్టినెంట్ గవర్నర్ కు వివరించడం లాంటివి జరుగుతుంటాయి. కానీ, పుదుచ్చేరిలో గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో స్టేజ్ పైనే లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ... ఏఐఏడీఎంకే ఎమ్మెల్యే అంబలగన్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కిరణ్ బేడీ సమక్షంలోనే ఆమె పనితీరును ఎమ్మెల్యే ఆక్షేపించడంతో ఇరువురు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పుదుచ్చేరిని బహిరంగ విసర్జన రహిత రాష్ట్రంగా ప్రకటించేందుకు కిరణ బేడీ అధ్యక్షతన ఓ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి గవర్నర్ కిరణ్ బేడీ - ఎమ్మెల్యే ఏ అంబాలన్ తో పలువురు ప్రజాప్రతినిధులు - ప్రముఖులు హాజరయ్యారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యే అంబాలగన్ ప్రసంగిస్తుండగానే ఆయన మైక్ కట్ అయ్యింది. స్టేజీ మీద ఎమ్మెల్యే అంబాలన్ ప్రసంగానికి సంబంధించి కిరణ్ బేడీకి - ఆయనకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కిరణ్ బేడీ పర్యవేక్షణలో తన నియోజకవర్గంలో ఎలాంటి పనులూ జరగలేదని ఆరోపించిన ఎమ్మెల్యే... ఎన్నో ప్రాజెక్టులను ప్రకటించినా ఏ ఒక్కటీ అమలు కావడంలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. స్టేజ్ పై ఆయనకు సర్ధిచెప్పేందుకు ప్రయత్నించిన కిరణ్ బేడీ... అంబలగన్ ను నమస్కారం చెబుతూ వెళ్లిపోవాల్సిందిగా విజ్ఞప్తి చేసినా వినకుండా సదరు ఎమ్మెల్యే వాగ్వాదానికి దిగాడు. కాగా, కిరణ్ బేడీపై అంబలగన్ విమర్శలు చేయడం ఇది తొలిసారి కాదనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇక ఇద్దరి మధ్య జరుగుతున్న మాటల యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నం చేసిన మరోనేత విషయంలో ఎమ్మెల్యే దురుసుగా వ్యవహరిస్తూ వేదిక నుంచి దిగిపోయారు.
కాగా, ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత కిరణ్ బేడీ స్పందిస్తూ... ఇచ్చిన సమయం కంటే ఎక్కువ సేపు మాట్లాడినందుకే మైక్ కట్ చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ‘‘నిమిషాల వ్యవధిలో జరగాల్సిన ఈ కార్యక్రమంలో... వాస్తవానికి ప్రసంగికుల జాబితాలో ఆ ఎమ్మెల్యే పేరు లేదు. అయితే ఫంక్షన్ ప్రారంభమయ్యే ముందు ఆయన వచ్చి తనకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలని పట్టుబట్టారు. తీరా అవకాశం ఇచ్చిన తర్వాత సమయం మించిపోతున్నా ప్రసంగిస్తూనే ఉన్నారు. ఇంకా చాలా కార్యక్రమం మిగిలి ఉండడంతో నేను జోక్యం చేసుకోవాల్సి వచ్చింది....’’ అని వెల్లడించారు.ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలైపోయింది.
Full View