వీహెచ్ కారు అద్దాలు ధ్వంసం.. వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు

Update: 2022-04-14 06:58 GMT
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ. హనుమంతరావు ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేసిన ఘటన సంచలనంగా మారుతోంది. అర్ధరాత్రి ఆయన ఇంటిపై దాడికి పాల్పడ్డాడు ఓ ఆకతాయి. హైదరాబాద్ అంబర్ పేటలోని ఇంటి ముందు ఉన్న కారును దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డ్ అయ్యాయి.

 కారును దుండగుడు ధ్వంసం చేసిన దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డ్  అయ్యాయి. దాడి జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ మొదలుపెట్టారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వీహెచ్ ఇంటిపై దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు.

యూపీకి చెందిన సిద్ధార్థ్ దాడి చేసినట్లుగా తేల్చారు. 6 నెలలుగా వీహెచ్ ఇంటిపక్కనే ఉంటున్న సిద్ధార్థ్ ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మద్యం మత్తులోనే ఓ వ్యక్తి వీహెచ్ ఇంటిపై దాడి చేశాడని తెలిపారు. సదురు వ్యక్తి పేరు సిద్ధార్థ్ సింగ్ అని యూపీకి చెందిన వాడని పోలీసులు తెలిపారు.

కాగా తన ఇంటిపై దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేస్తూ వీహెచ్ ట్యాంక్ బండ్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు.అంబేద్కర్ విగ్రహం వద్ద వీహెచ్ ఆందోళన చేయడంపై అంబేద్కర్ కమిటీ సభ్యులు నిరసన తెలిపారు. ఈ క్రమంలోనే పోలీసులు విచారణ వేగవంతం చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో గొడవ సద్దుమణిగింది.

ఇక వీహెచ్ ఇంటిపై దాడి విషయం తెలుసుకున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫోనులో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ దాడిని ఖండిస్తున్నట్టు రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ నేతలపై దాడులకు పాల్పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
Tags:    

Similar News