చట్టసభల్లో సభ్యుల తీరు మార్చుకోకపోతే ప్రమాదం: ఉపరాష్ట్రపతి హాట్ కామెంట్స్

Update: 2021-12-16 05:20 GMT
దేశాన్ని దశ, దిశ మార్చేవి చట్ట సభలు. పార్లమెంట్, రాజ్యసభ సభల్లోని తీసుకునే నిర్ణయాలే దేశ స్థితిగతులను మార్చేస్తాయి. అలాంటి చట్టసభుల్లోకి గౌరవ ప్రదంగా ఎన్నికైన నాయకుల తీరు రోజురోజుకు మారిపోతుంది. సమస్యలపై సభల్లో ప్రస్తావించాల్సి ఉండగా.. బలనిరూపణలు చూపించుకుంటున్నారని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

కొద్ది కాలంగా ఉభయ సభల్లోని సభ్యుల తీరు చూస్తే బాధ కలుగుతుందని అన్నారు. ఒకప్పుడు చట్టసభల్లో పదునైన విమర్శలు ఉండేవి. కానీ నేడు కొందరు భుజబలం చూపిస్తున్నారని అన్నారు. రానున్న రోజుల్లోనూ ఇదే పరిస్థితి ఉంటే దేశ భవిష్యత్ ఆందోళనకంగా మారే ప్రమాదం ఉందని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ అధికార భాష సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రచించిన ‘గాంధీ టోపీ గవర్నర్’ అనే పుస్తకాన్ని వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఈడ్పుగంటి రాఘవేందర్రరావు సంక్షిప్త జీవితగాథ నేపథ్యంలో ఈ పుస్తకాన్ని రచించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయడు పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

చట్టసభల్లో కలుషిత వాతావరణం ఏర్పడిందన్నారు. సభలను గౌరవించేవాళ్లు రోజు రోజుకు తరిగిపోతున్నారన్నారు. కొందరు నేతల అమర్యాదగా ప్రవర్తిస్తూ సభా గౌరవాన్ని దెబ్బతీస్తున్నారన్నారు.

ఇప్పటి పరిస్థితులు చూస్తే రోజూ నిద్ర పట్టడం లేదన్నారు. ముందు ముందు ఇంకెన్నీ ఘరాలు చూడాల్సి వస్తోందనని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై మాట్లాడాల్సిన వారు వ్యక్తిగత విషయాలపై ధూషించుకోవడం ప్రారంభించారన్నారు. మాట్లాడడం మానేసి భుజబలాన్ని చూపిస్తున్నారని ఆక్రోశం వ్యక్తం చేశారు.

ప్రజాప్రతినిధులు చట్టసభలలో గౌరవంగా నడుచుకోవాల్సి ఉందని, ఇవి వ్యాయమం చేసే తాలింఖానాలు కావని అన్నారు. మీకు చైతనైతే బుద్ది బలం చూపించాలన్నారు. భుజబలంతో ఇక్కడ పనిలేదని విమర్శించారు.

ఇటీవల కాలంలో కొందరు సభ్యులు తాము తప్పుడు పనులు చేయడమే కాకుండా వాటిని సమర్థించుకోవడం మరో తప్పు చేస్తున్నారన్నారు. చట్టసభలకు వచ్చేవారు మేధస్సును పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని,బుద్ధి బలతంతో ఎంతటి సమస్యనైనా పరిష్కరించవచ్చన్నారు.

ఇప్పటికైనా నాయకులు తమ ప్రవర్తనను మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. లేకుంటే సభ్యులపై ప్రజలకు నమ్మకం పోయే ప్రమాదం ఉందన్నారు. నాయకుల తీరును యావత్ దేశం పరిశీలిస్తోందని, ఇలాంటి ప్రవర్తన మార్చుకోకపోతే వ్యక్తిగతంగాను, పార్టీకి చెడ్డపేరు వచ్చే అవకాశం ఉందన్నారు.

ఇక యార్లగడ్డ రచించిన పుస్తకం గురించి ఉపరాష్ట్రపతి మాట్లాడారు. బ్రిటిష్ పాలనలో వక్రీకరిస్తూ రచించిన మనదేశ చరిత్రను తిరిగి వాస్తవ అంశాలతో వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. మన దేశ వాస్తవాల గురించి చెబుతూ రచనలు చేయాలన్నారు. ఇలాంటి రచనల వల్ల భారతదేశం గురించి నిజాలు బయటపడుతాయన్నారు.

దేశం గురించి అసలు నిజం తెలియక చాలా మంది తమ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల జీవిత చరిత్రల ఆధారంగా, వారి చరిత్రలను అధ్యయనం చేసి అసలు విషయాలను వెలుగులోకి తీసుకురావాలన్నారు. మంచి రచనతో ప్రజల్లో ఎన్నో మార్పులు తీసుకురావచ్చన్నారు.

చాలా మంది రచయితలు దేశం గురించి వాస్తవాలు చెప్పేందుకు ఎంతో ప్రయత్నించారన్నారు. అయితే కొన్ని మాత్రమే వెలుగులోకి వచ్చాయని తెలిపారు. భారతదేశానికి వేల సంవత్సరాల చరిత్ర ఉందని, అయితే ముందు తరాల వారికి ఉపయోగపడే రచనలు చేస్తే భావితరాల వారికి దేశ అభ్యున్నత చరిత్రను అందిచగలిగిన వారవముతామన్నారు.

స్వాతంత్ర్య సమరయోధుడు ఈడ్పుగంటి రాఘవేంద్రరావు జీవిత చరిత్రను వెలుగులోకి తీసుకురావడంపై యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ నుఅభినందించారు. అయితే తెలుగులోనే కాకుండా వీరి జీవిత చరిత్రలను ఇతర భాషల్లోకి కూడా అనువదించేందుకు ప్రయత్నించాలని ఉప రాష్ట్రపతి తెలిపారు. రాబోవు తరాలు వీరి గొప్పదనాలు ఆదర్శంగా తీసుకొని వారి భవిష్యత్తును మార్చుకునే శక్తి ఉంటుందన్నారు.




Tags:    

Similar News