మహిళలను లైంగిక వేధింపులకు గురి చేసిన కేసులో గజల్ శ్రీనివాస్ ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. లైంగిక వేధింపుల కేసులో గజల్ శ్రీనివాస్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఏ-2గా ఉన్న పనిమనిషి పార్వతిని విచారణకు హాజరు కావాలని పిలిచారు. ఈ వ్యవహారంలో ఆమె పాత్ర ఎంత వరకు ఉందనే దానిపై ఆరా తీయనున్నారు.మరోవైపు గజల్ శ్రీనివాస్ గదిలో బాగోతానికి సంబంధించిన మరో వీడియో బయటికొచ్చింది. ఇందులో మసాజ్ ను దాటి మరింత ముదిరిన వ్యవహారం ఉంది.
ప్రధానంగా బాధితురాలు పార్వతిపై ఆరోపణలు చేసింది. తనను గజల్ శ్రీనివాస్ తో గడపాలని ఒత్తిడి చేసిందని చెప్పింది.పార్వతి తనను ఏ విధంగా ప్రలోభాలకు గురి చేసిందీ.. ఆ వీడియో క్లిప్పుంగులు కూడా ఇచ్చానని వెల్లడించింది. ఆధారాలు సంపాదించడం కోసమే గజల్ కాళ్లు పట్టుకున్నానని, అంతకుమించి ఇంకేమీ చేయలేదని ఆమె తెలిపింది. తనపై గజల్ చేసిన ఆరోపణలు అవాస్తవమని, గజల్ చేసిన దారుణానికి సంబంధించిన అన్ని వీడియోలు ఆధారాలతో సహా పోలీసులకు అందజేశానని బాధితురాలు స్పష్టం చేసింది. ఇటువంటి దుస్థితి ఇంకో మహిళకు రాకూడదనే ఉద్దేశంలో ఆధారాలతో సహా పోలీసులకు పిర్యాదు చేశానని బాధితురాలు అరుణ కుమారి వెల్లడించింది.
కాగా, పని మనిషిని పోలీసులు ప్రశ్నించనున్నారని సమాచారం. అలాగే ఆలయ వాణి మాజీ ఉద్యోగుల్ని కూడా విచారణకు హాజరు కావాలని పిలిచినట్లు తెలుస్తోంది. ఇటు గజల్ బెయిల్ పిటిషన్ - పోలీసు కస్టడీ పిటిషన్లు నేడు విచారణకు రానున్నాయి. ఈ కేసులో ఏ-1గా ఉన్న గజల్ ను ప్రశ్నిస్తే మరిన్ని వాస్తవాలు బయటపడతాయని పోలీసులు అంటున్నారు. అందుకే అతడ్ని కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేశారు. ఇంకా బాధితులెవరైనా ఉంటే ధైర్యంగా తమకు ఫిర్యాదు చేయొచ్చంటున్నారు.లైంగిక వేధింపుల కేసులో చంచల్ గూడ జైలులో ఉన్న గజల్ శ్రీనివాస్ కు పోలీస్ కస్టడీ, బెయిల్ పిటిషన్లపై తీర్పును హైదరాబాద్ నాంపల్లి కోర్టు రేపటికి వాయిదా వేసింది. గజల్ శ్రీనివాస్ కు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ మంజూరు చేయొద్దని పంజాగుట్ట పోలీసులు నాంపల్లి కోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. గజల్ శ్రీనివాస్ బయటకు వస్తే సాక్ష్యాలను ప్రభావితం చేస్తాడని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ కేసులో ఇంకా పలువురిని విచారించాల్సి ఉందని, బాధితురాలి వాంగ్మూలం కూడా రికార్డ్ చేయాల్సి ఉందని పోలీసులు కౌంటర్ పిటిషన్ లో తెలిపారు.
గజల్ శ్రీనివాస్ తరపు న్యాయవాది ఉమామహేశ్వర్ రావు కూడా కోర్టులో వాదనలను వినిపించారు. 41 సీఆర్పీసీ కింద నోటీసు ఇచ్చిన పోలీసులు.. తమ క్లయింట్ కు వివరణ ఇవ్వడానికి కూడా సమయం ఇవ్వలేదన్నారు. పోలీసులు వ్యవహరించిన తీరు చట్టవిరుద్దమని వాదించారు. తన క్లయింట్ ను పోలీసుల కస్టడీకి అనుమతించకుండా వెంటనే బెయిల్ ఇవ్వాలని కోర్టుకు విన్నవించారు.
గజల్ శ్రీనివాస్ తరపు న్యాయవాది వాదనలకు ప్రభుత్వ లాయర్ కౌంటర్ ఇచ్చారు. 41 సీఆర్పీసీ కింద అతనికి నోటీసు ఇచ్చినప్పటికీ సరైన సమాధానం ఇవ్వనందుకే అరెస్ట్ చేశామని తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో పాటు అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతనే గజల్ శ్రీనివాస్ ను అరెస్ట్ చేశామన్నారు. శ్రీనివాస్ ను ఇంకా విచారించాల్సి ఉందని, అందుకే 7 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరామన్నారు. ఇరు వాదనలు విన్న నాంపల్లి కోర్టు కస్టడీ పిటిషన్ పై తీర్పు వాయిదా వేసింది.
మరోవైపు ఖైరతాబాద్ ఆనంద్ నగర్ లో నిర్వహిస్తున్న సేవ్ టెంపుల్ అనే సంస్థకు శ్రీనివాస్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు. ఆ సంస్థకు చెందినదే ఆలయవాణి రేడియో. సంస్థ యజమానులు అమెరికాలో ఉంటుండగా... శ్రీనివాస్‌కు ఆ సంస్థ బాధ్యతలను అప్పగించడంతో ఆయనే ఆ సంస్థ వ్యవహారాలు చూసుకుంటున్నాడు. అయితే... ఆయన లైంగిక వేధింపుల కేసులో అరెస్టవడంతో సేవ్ టెంపుల్ బ్రాండ్ అంబాసిడర్ గా ఆయనను తొలగిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.