వైరల్ వీడియో: పడవ మునగడానికి ముందు

Update: 2019-09-16 08:30 GMT
గోదావరి అందాలను చూస్తూ పయనించారు. ప్రకృతి సోయగానికి పరవశించారు.  కేరింతలు, ఆనందం, ఆహ్లాదంతో విహరించారు. సెల్ఫీలు, వీడియోలు తీస్తూ డ్యాన్సులు చేస్తూ గడిపారు. అంతలోనే వారి బోటు బోల్తాపడి వారి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి..

తూర్పుగోదావరి జిల్లా కచ్చలూరు వద్ద జరిగిన ఘోర పడవ ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో విషాదం నింపింది.  ఈ ప్రమాదంలో ఎంత మంది చనిపోయారనే విషయంపై ఇంతవరకూ క్లారిటీ లేదు. అయితే ఇప్పటివరకు సహాయక బృందాలు 12 మృతదేహాలను వెలికితీశాయి.

అయితే ఆనందంతో సాగిన వారి టూర్ లో పడవ మునగడానికి కేవలం 5 నిమిషాల ముందు పర్యాటకులు ఎంతో ఉత్సాహంగా తీసుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో బయటకు వచ్చింది. సరదాగా సెల్ఫీలు దిగుతూ సన్నిహితులు, కుటుంబ సభ్యులతో ఉత్సాహం గడుపుతున్న యువకులు ఆ వీడియోలో కనిపించారు.

కొందరు చుట్టుపక్కల గుట్టల పచ్చదానాన్ని, గోదారి అందాలను తమ ఫోన్లో బంధిస్తున్నారు. పాటలకు నృత్యాలు చేస్తున్నారు. డ్రైవర్ బోటును నడిపిస్తున్న దృశ్యమూ కనిపించింది.

అయితే పడవ లోపల కూర్చున్న ఎవరూ లైఫ్ జాకెట్లు వేసుకున్నట్టు వీడియోలో కనిపించలేదు. ఒకవేళ వారు గనక నిజంగా లైఫ్ జాకెట్లు వేసుకొని ఉంటే ఇప్పుడు ప్రాణాలతో బతికి బట్టకట్టేవారు. వీడియోలో కనిపించనదాన్ని బట్టి లోపల కూర్చున్న వారిలో మెజార్టీ పర్యాటకులు లైఫ్ జాకెట్లు వేసుకోలేదు. ఆ నిర్లక్ష్యంతోనే ఈ ఘోర ప్రమాదంలో మునిగిపోయి ఉంటారని భావిస్తున్నారు.

Full View
Tags:    

Similar News