ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన విద్వేషపూరిత ప్రసంగంపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతోంది. దేశంపైన తీవ్రస్థాయిలో విషం కక్కిన ఆయన ప్రసంగానికి ధీటుగా బదులిస్తూ భారత్ సమాధానం ఇచ్చింది. ఇమ్రాన్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించింది.
సర్వప్రతినిధి సభ నిబంధనల్లో రైటు టు రిప్లై క్లాజ్ ను ఉపయోగించుకుంది భారత్. దీని ప్రకారం ఎవరైనా చేసిన ప్రసంగం మీద అభ్యంతరాలు ఉన్నా.. తిరిగి సమాధానం చెప్పాలని భావిస్తే.. ఈ క్లాజ్ ప్రకారం అనుమతి తీసుకొని తమ వాదనను వినిపించొచ్చు. మోడీ తర్వాత ఇమ్రాన్ ప్రసంగించటం.. భారత్ మీద విషం కక్కిన నేపథ్యంలో భారత్ తన సమాధానాన్ని వెల్లడించింది.
భారత విదేశాంగ ఫస్ట్ సెక్రటరీ విదిషా మైత్రా తాజాగా రియాక్ట్ అయ్యారు. ఇమ్రాన్ వ్యాఖ్యలు దౌత్యవేత్తలా కాకుండా యుద్ధాన్ని రెచ్చగొట్టే వ్యక్తిలా.. అణుయుద్ధం తప్పదంటూ వార్నింగ్ ఇవ్వటం సరికాదన్న ఆమె.. భారత్ తరఫున తన వాదనను బలంగా వినిపించారు.
ఇమ్రాన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన తరహాలో ఆమె ప్రసంగం సాగింది. విషం చిమ్మిన ఇమ్రాన్ కు తగిన రీతిలో బుద్ధి చెప్పేప్రయత్నం చేశారు. తన వక్ర బుద్ధిని ఇమ్రాన్ స్వయంగా అంతర్జాతీయ వేదిక మీద తనకు తానే ప్రదర్శించారని ఎద్దేవా చేశారు.
ఉగ్రవాదులకు పాక్ పుట్టినిల్లుగా మారింది నిజం కాదా? అని ప్రశ్నించిన ఆమె.. ఉగ్రసంస్థలతో ఎలాంటి సంబంధం లేదని పాకిస్తాన్ నిరూపించగలదా? అంటూ సవాల్ విసిరారు. పాక్ ప్రధాని ప్రసంగం విభజనను.. విభేదాలను పెంచేలా.. ద్వేషాన్ని రెచ్చగొట్టేలా మారిందన్నారు. తన ప్రసంగంలో పేర్కొన్న రక్తపాతం.. హింసాకాండ.. జాతి అధిపత్యం.. తుపాకీ తీయటం లాంటి మాటలు 21వ శతాబ్దపు ఆలోచనలకు కాకుండా మధ్య యుగపు నియంతృత్వ భావాల్ని ప్రతిబింబించేలా ఉన్నాయన్నారు.
ఐక్య రాజ్య సమితి విడుదల చేసిన నివేదికలో ఉగ్రవాదుల జాబితాలోని అల్ ఖైదా ఉగ్రవాదికి పెన్షన్ అందించే ఏకైక దేశం పాకిస్తాన్ కాదా? అని ప్రశ్నించారు. ఉగ్రవాదులకు ఆర్థిక సాయం చేయకుంటే.. న్యూయార్క్ లోని హబీబ్ బ్యాంకును ఎందుకు మూసివేయాల్సి వచ్చిందో పాక్ వివరణ ఇవ్వగలదా? అని అడగటంతో పాటు ఎఫ్ఏటీఎఫ్ ఆ దేశాన్ని ఎందుకు పెట్టిందో ప్రపంచ దేశాలకు చెప్పగలదా? అని ప్రశ్నించారు.
ఒసామా బిన్ లాడెన్ కు పాక్ బహిరంగ రక్షకుడని ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యల్ని ఆయన ఖండిస్తారా? ఐక్యరాజ్య సమితి ప్రకటించిన జాబితాలోని 135 మంది ఉగ్రవాదులకు.. పాతిక ఉగ్రవాద సంస్థలకు ఆ దేశం ఆశ్రయం ఇవ్వటం నిజం కాదా? యూఎన్ విడుదల చేసిన జాబితాలో అల్ ఖయిదా ఉగ్రవాదికి పాక్ పెన్షన్ నిజం కాదని ఇమ్రాన్ ఖండించగలరా? అన్న మైత్రా ప్రశ్నల పరంపరకు ఇమ్రాన్ అండ్ కో ఎలాంటి బదులిస్తారో చూడాలి.
మోడీ ప్రసంగానికి.. ఇమ్రాన్ ప్రసంగానికి మధ్య తేడా ఎంతో ఉందని.. భారత ప్రధాని తన ప్రసంగంలో శాంతి.. అహింస సందేశాన్ని ఇస్తే.. ఇమ్రాన్ యుద్ధానికి సిద్ధం కావాలంటూ మెసేజ్ ఇచ్చి తన నిజ స్వరూపం బయటపెట్టుకున్నారన్నారు. కవ్వించి కప్పిపుచ్చుకోవటం మంచి పద్దతి కాదని ఆమె హితవు పలికారు.