ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టుబట్టి - ఇష్టపడి పూర్తిచేసి పట్టిసీమ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త ట్వీస్ట్ ఇచ్చారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా నదిలోకి మళ్ళిస్తున్నదని, దీనిపై తమకు రావాల్సిన వాటాను వెంటనే ఇవ్వాలని కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేయించారు. గోదావరి జలాల నిష్పత్తిలో స్పష్టత రాలేదని వాయిదావేస్తూ ఉంటే రాబోయే వేసవి సీజన్ కూడా ముగిసి తమ రైతాంగానికి ఇబ్బంది అవుతుందని తెలంగాణ సాగునీటిపారుదల సలహాదారు విద్యాసాగర్ రావు నేతృత్వంలోని బృందం కేంద్రానికి వివరించింది. కృష్ణాజలాల కేటాయింపులో మూడు ప్రధాన అంశాలను కేంద్ర జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి అమర్జీత్ సింగ్ దృష్టికి తెలంగాణ సాగునీటిపారుదల సలహాదారు విద్యాసాగర్ రావు తెచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో మాదిరే తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా కృష్ణాజలాల్లో రాష్ట్రానికి అన్యాయమే జరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
పట్టిసీమ ద్వారా తీసుకుంటున్న నీటిని పూర్తిస్థాయిలో ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే వినియోగించుకుంటూ గత ట్రిబ్యునల్ తీర్పును సైతం ఉల్లంఘిస్తున్నదని, తెలంగాణకు చుక్క నీరు ఇవ్వడంలేదని తెలంగాణ సాగునీటిపారుదల సలహాదారు విద్యాసాగర్ రావు తప్పుపట్టారు. ఏపీ ఒత్తిడికి కేంద్రం తలొగ్గినట్లుగా తాజా పరిణామాలన్నీ తెలియజేస్తున్నాయని, వెంటనే జోక్యం చేసుకొని బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ కు స్పష్టమైన ఆదేశాలు జారీచేయాలన్నారు. పట్టిసీమ నీటివాటా నిష్పత్తిపై నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలన్నారు. వివిధరకాలైన సాకులను చూపుతూ బోర్డు తన బాధ్యతలను నిర్వర్తించడంలేదని, ఫలితంగా విలువైన సీజన్ వృథా అయిపోయి రైతులకు అన్యాయం జరుగుతున్నదన్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం రాలేదని నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం సమంజసం కాదని, గత ఏడాది నిష్పత్తి మేరకైనా నీటి కేటాయింపులు చేసి వెంటనే అమలుచేయాలని తెలంగాణ సాగునీటిపారుదల సలహాదారు సూచించారు. కృష్ణా జలాల కేటాయింపు - నిర్వహణ విషయంలో నదీ యాజమాన్య బోర్డు వ్యవహరిస్తున్న తీరు అసంతృప్తికరమని విద్యాసాగర్ రావు వ్యాఖ్యానించారు. బోర్డు తాను చేయాల్సిన పనిని పక్కకుపెట్టి తన పరిధిలో లేని విషయాల్లో జోక్యం చేసుకుంటున్నదని ఆరోపించారు. కొన్ని జిల్లాల్లోని వివరాలను మాత్రమే ప్రస్తావిస్తూ తెలంగాణ మొత్తంలో నీరు పుష్కలంగా ఉందని ఏపీ ప్రభుత్వం బోర్డుకు వివరించిందని, కానీ వాస్తవిక వివరాలను సేకరించడంలో బోర్డు తగిన చొరవ తీసుకోలేదన్నారు. మహబూబ్ నగర్ - ఖమ్మం - నల్లగొండ జిల్లాల్లో పెద్దగా వర్షపాతం నమోదుకాలేదన్నారు.
ఆయన వివరించిన మూడు అంశాలివే..
-గోదావరి జలాలను కృష్ణా బేసిన్ లోకి తరలించినప్పుడు నాగార్జునసాగర్ కు ఎగువన ప్రాంతానికి నిర్దిష్టంగా ఇవ్వాల్సిన నీటి పరిమాణం ఎంతో గతంలో బచావత్ ట్రిబ్యునల్ చెప్పింది. ఆ ప్రకారమే పట్టిసీమ నీటిలో తెలంగాణకు వాటా ఇవ్వాలని, ఏపీకి ఉత్తర్వులు జారీ చేయాలి. ఒకవేళ అభ్యంతరాలుంటే పాత నిష్పత్తి ప్రకారం తాత్కాలిక ప్రాతిపదికన ఇవ్వాలి. కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ నియమించిన ఐదుగురు సభ్యుల కమిటీ 90 రోజుల్లో నివేదిక సమర్పిస్తుంది. ఈ లోపు యాసంగి సీజన్ కు నీరు అందదు కాబట్టి అడ్ హాక్ ప్రాతిపదికన నీటిని ఇవ్వాలని, ఈ మేరకు బోర్డుకు లేఖ రాయాలి.
-కృష్ణానది యాజమాన్య బోర్డు ఇటీవల నిష్పత్తిని మార్చే అధికారం బోర్డుకు లేదని స్పష్టం చేయడంతోపాటు, దీన్ని విరమించుకోవాల్సిందిగా లేఖ రాయాలి.
-నీటి కేటాయింపుల అధికారం ట్రిబ్యునల్ కు మాత్రమే ఉన్నందున ప్రస్తుత బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ కు ఈ బాధ్యతను అప్పజెప్పనందువల్ల వెంటనే లేఖరాసి తగిన పరిష్కారం చూపాలనిఆదేశించాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/