ఒకటి కాదు రెండి కాదు ఏకంగా 40 ఏళ్లుగా నిద్రపోవడంలేదట ఆయన. వియత్నాంకు చెందిన జాక్ ఆ దేశంలోని ఓ మారుమూల గ్రామంలో నివసిస్తాడు. ఆయనో సాధారణ రైతు. అయితే... 1973 లో ఆయనకు తీవ్ర జ్వరం రావడంతో డాక్టరు వద్దకు వెళ్లాడట. డాక్టరు జ్వరాన్ని తగ్గించాడట కానీ కొత్త సమస్య ఒకటి మొదలైంది. నిద్ర పట్టడం మానేసింది. ఏదో మానసిక ఆందోళనల వల్ల అలా జరుగుతుందేమో అని అనుకుని మందులు ఇవ్వడం, కౌన్సెలింగు చేసినా ఫలితం లేకపోయింది. చివరికి తేలిందేమిటంటే ఆయనకు ఇంతవరకు ఎవరకీ రాని నిద్రపట్టని జబ్బు వచ్చినట్లు తేలింది. అది మొదలు జాక్ కంటి మీద కునుకు తేదు. గత 40 ఏళ్లు గా ఆయన మేలుకునే ఉంటున్నాడు.
అయితే, తనకు వచ్చిన నిద్రపట్టని జబ్బును కూడా జాక్ సానుకూలంగా తీసుకున్నాడు. ఎలాగూ నిద్రపట్టడం లేదు కదా అని పగలు రాత్రి పని చేయడం ప్రారంభించాడు. రాత్రి పగలు అన్నదే లేకుండా పని చేసుకుంటూ ఏకంగా రెండు చెరువులు తవ్వేశాడు. వేరే వ్యక్తి సహాయం లేకుండానే ఒక్కడే రెండు చెరువులను తవ్వడం విశేషం. ఈ జబ్బు వల్ల అతడు మానసిక - శారీరక పరిస్దితి ఏ విధంగా మారుతుందో అని అతని కుటుంబసభ్యులు భయపడుతున్నారు . ఈ వింత రోగం శాపమో, వరమో తెలియక తికమక పడుతున్నారు.
నేను నిద్రపోను.. ఎవరినీ నిద్రపోనివ్వను అని నిత్యం చెప్పే ఏపీ సీఎం చంద్రబాబు - ప్రధాని మోడీలకు గానీ జాక్ సంగతి తెలిస్తే ఆయన్ను ఆదర్శంగా తీసుకోమని అధికారులకు - మంత్రులకు చెప్పేవారేమో. లేదంటే తమ వద్ద 24 గంటలూ పనిచేయడానికి ఆయన్న తీసుకొచ్చేవారేమో.