గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో యురేనియం మైనింగ్ విషయమై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రజలతో పాటు సెలబ్రెటీలు కూడా నల్లమల్ల అడవుల్లో యురేనియం మైనింగ్ కు వ్యతిరేకంగా ఉద్యమంను మొదలు పెట్టారు. టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు యురేనియం మైనింగ్ కు సంబంధించి తమ వ్యతిరేక గళం వినిపించారు. అందులో ముఖ్యుడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. ఈయన తాజాగా అదే విషయమై మీడియా ముందుకు వచ్చి తన అభిప్రాయంను వెళ్లడించాడు.
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. యురేనియం మైనింగ్ వల్ల మన దేశం చాలా పవర్ ఫుల్ అవుతుందని చాలా మంది అనుకుంటున్నారు. కాని యురేనియం ఉన్నంత మాత్రాన మనం పవర్ ఫుల్ అయిపోలేం. మనం యురేనియం నుండి ఎంత ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తున్నాం.. స్పేస్ రీసెర్చ్ ఎంత చేస్తున్నాం అనేదానిపై ఆధారపడి ఉంటుంది. మైనింగ్ చేయడం వల్ల భారీగా డబ్బు వచ్చి అయితే పడదు. ఐరన్.. ఓర్ ఆయిల్ ఉత్పత్తి చేసే వారికంటే ఐరెన్ ఓర్ తో స్టీల్ ను తయారు చేసే వారికే ఎక్కువ లాభం ఉంటుంది. క్రూడ్ ఆయిల్ కంటే పెట్రోల్ డీజిల్ కంపెనీలకు ఎక్కువ లాభం ఉంటుంది. అలాగే యురేనియం మైనింగ్ చేసినంత మాత్రాన ఇండియా పవర్ ఫుల్ దేశం అయ్యి పోదని విజయ్ దేవరకొండ అన్నాడు.
ప్రస్తుతం ఎన్నో ప్రపంచ దేశాలు యురేనియంను ఎగుమతి చేస్తున్నాయి. కజికిస్తాన్ ప్రపంచంలోనే అత్యధిక యురేనియంను ఎగుమతి చేస్తుంది. మరి ఆ దేశం ఎంత మేరకు పవర్ ఫుల్ అయ్యింది. నమీబియా.. కాంబో లాంటి దేశాలు కూడా యురేనియంను ఎగుమతి చేస్తున్నాయి. మనకు కావాలంటే ఆయా దేశాల నుండి కొనుగోలు చేసుకోవచ్చు. నేనేం యురేనియం మైనింగ్ కు పూర్తి వ్యతిరేకం కాదు. కాని నల్లమల్ల అడవుల్లో యురేనియం తవ్వకాలు మాత్రమే వద్దంటున్నాను అన్నాడు. ఇదే యురేనియం మైనింగ్ మనం తాగే వాటర్ ఎఫెక్ట్ కాకుండా అడవులు నాశనం కాకుండా చేస్తానంటే ఎలాంటి అభ్యంతరం లేదు. నల్లమల్ల అడవుల్లో యురేనియం మైనింగ్ వల్ల ఏదైనా ఎఫెక్ట్ అయితే మళ్లీ దాన్ని మనం రికవరీ చేయడం అసాధ్యం. ఇంట్లో కూర్చుని రోడ్లు వేసేందుకు ప్లై ఓవర్ వేసేందుకు కాస్త స్థలం ఇవ్వమంటే ఇవ్వకుండా కోర్టులకు వెళ్లే వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారి వల్ల హైదరాబాద్ లో ఎన్నో ప్లై ఓవర్ లు ఆగిపోయాయి. అలాంటి వారు అడవుల గురించి మాత్రం పట్టించుకోరు. అక్కడ ఏం అయితే మనకేంటి అనేది వారి ఉద్దేశ్యం. నాకు ఈ విషయం గురించి ఈమద్యే తెలిసింది. కాని ప్రజలే ఈ ఉద్యమంను ఎప్పుడో ప్రారంభించారు. ఇదేం పొలిటికల్ ఇష్యూ కాదు. పవన్ కళ్యాణ్.. రేవంత్ రెడ్డి ఇంకా ఇండస్ట్రీ వారు పలువురు మాట్లాడటం సంతోషం. గవర్నమెంట్ నుండి కూడా కేసీఆర్ గారు స్పందించి తెలంగాణలో యూరేనియం మైనింగ్ కు ఒప్పుకోమని చెప్పడం కు కారణం అయిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. మన గురించి మనం ఆలోచించుకోవడంతో పాటు మన చుట్టు పక్కల ఏం జరుగుతుందనే విషయాన్ని కూడా చూడాలి. కాని ప్రస్తుత రోజుల్లో మన చుట్టు ఏం జరుగుతుందో చూడలేక పోతున్నాం. యురేనియం మైనింగ్ చేసి ఎలక్ట్రిసిటీ ఉత్పతి చేయాల్సిన అవసరం లేకుండా సోలార్ ను ఉపయోగించి విద్యుత్ ను ఉత్పత్తి చేసుకునేందుకు ప్రయత్నించాలి. అంతే తప్ప పకృతిని నాశనం చేయవద్దని విజయ్ దేవరకొండ విజ్ఞప్తి చేశాడు.