వేలాది కోట్ల రూపాయిలు బ్యాంకులకు అప్పులు పడి.. వాటిని తీర్చకుండా చడీచప్పుడు కాకుండా దేశం దాటేసిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు చెందిన ఆస్తులు ఒక్కొక్కటిగా వేలానికి వెళ్లిపోతున్నాయి. మొన్నా మధ్య ఆయనకు చెందిన ఇంటిని వేలానికి పెట్టటం.. దాన్ని కొనేందుకు ఎవరూ రాకపోవటం తెలిసిందే. తాజాగా ఆయనకు చెందిన విమానం అమ్మకానికి వచ్చేసింది.
అయితే.. ఈ విమానాన్ని మాల్యా అమ్మకానికి పెట్టలేదు. ఆయన బాకీ పడిన సర్వీస్ టాక్స్ శాఖ తాజాగా వేలంపాటను ప్రకటించింది. మాల్యాకు చెందిన ప్రైవేటు విమానం ముంబయి ఎయిర్ పోర్ట్ లో వాడకుండా ఓ మూలన పడి ఉంది. ఈ విమానాన్ని గడిచిన రెండేళ్లుగా వాడటం లేదు. తాజాగా తమకు రావాల్సిన బకాయిల వసూలు కోసం.. మాల్యాకు చెందిన ఎయిర్ బస్ ఎ319-133 సీజే ఫ్లైట్ ని వేలం వేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందుకోసం ఒక ఆంగ్ల దినపత్రికలో ప్రకటన ఇవ్వటం గమనార్హం.
సర్వీస్ టాక్స్ శాఖకు మాల్యా నుంచి రూ.370 కోట్లకు పైగా పన్ను సొమ్ము బకాయి ఉంది. అయితే.. మాల్యా ఫ్లైట్ కి అంత మొత్తం వస్తుందా? అన్నది ఒక ప్రశ్న. అయితే.. ఇదే మోడల్ కు చెందిన కొత్త విమానం కొనుగోలు చేయాలంటే ఇప్పుడు రూ.590 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. ఈ నేపథ్యంలో తన అభిరుచికి తగ్గట్లుగా తయారు చేసుకున్న మాల్యా విమానాన్ని ఎంత ధర వస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గత రెండేళ్లుగా విమానం వినియోగించని నేపథ్యంలో రూ.300 కోట్ల నుంచి రూ.330 కోట్ల మధ్య ధర పలికే అవకాశం ఉందంటున్నారు. ఆ మాట ఎంత నిజమన్నది వేలం పాట జరిగితే కానీ తేలదు.